Site icon NTV Telugu

IP68+IP69+IP69K రేటింగ్స్, Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌తో లాంచ్ కు సిద్ధమైన OnePlus Turbo 6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్..!

Oneplus Turbo 6

Oneplus Turbo 6

OnePlus Turbo 6 Series: వన్ ప్లస్ (OnePlus) నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. OnePlus Turbo 6 సిరీస్ త్వరలో చైనాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు ఉంటాయని వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ లో OnePlus Turbo 6, OnePlus Turbo 6V స్మార్ట్ ఫోన్స్ ఉండనున్నాయి. అయితే లాంచ్‌కు ముందే ఈ రెండు ఫోన్ల డిజైన్, కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూసేద్దామా..

OnePlus అధికారిక Weibo పోస్ట్ ప్రకారం.. OnePlus Turbo 6 సిరీస్ జనవరి 8న సాయంత్రం 7 గంటలకు (చైనా సమయం) లాంచ్ కానుంది. ఇది భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు ఉంటుంది. లైవ్ ఈవెంట్ ద్వారా ఫోన్ల డిజైన్‌తో పాటు ముఖ్య ఫీచర్లను కంపెనీ పరిచయం చేసింది. ఈ రెండింటికీ ఒకేలా కనిపించే డిజైన్ ఉండనుంది. వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా ఐలాండ్ ఉండగా.. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు LED ఫ్లాష్ ఉంటుంది. ఫోన్లకు మ్యాట్ ఫినిష్ ఫ్రేమ్ ఉండగా, కలర్‌కు మ్యాచ్ అయ్యే ఎడ్జ్‌లను అందించారు. Turbo 6 మోడల్ బ్లాక్, సిల్వర్, టర్కాయిస్ కలర్స్‌లో వస్తుండగా.. Turbo 6V బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Mukkoti Ekadashi: రేపే ముక్కోటి ఏకాదశి.. 7 నియమాలు పాటిస్తే, శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పక్కా..!

OnePlus Turbo 6లో 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వచ్చే ఈ ఫోన్‌కు IP68 + IP69 + IP69K డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటం విశేషం. ఈ ఫోన్‌కు పవర్ అందించేది Snapdragon 8s Gen 4 ప్రాసెసర్. దీనితో పాటు LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్, Adreno 825 GPU లభిస్తాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది Android 16పై రన్ అవుతుంది.

OnePlus Turbo 6లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + 8MP సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఇచ్చారు. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 9,000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. దీనికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తోపాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు మరింత అఫోర్డబుల్ ధరలో.. Samsung Galaxy S25 Ultra 5Gపై రూ.20,000 డిస్కౌంట్..!

Turbo 6తో పాటు లాంచ్ కానున్న OnePlus Turbo 6Vలో కూడా చాలా ఫీచర్లు ఒకేలా ఉంటాయి. అయితే ఇందులో Snapdragon 7s Gen 4 చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాటరీ, కెమెరా, కనెక్టివిటీ ఫీచర్లు Turbo 6 మాదిరిగానే ఉంటాయని కంపెనీ టీజ్ చేసింది. మొత్తంగా శక్తివంతమైన ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో OnePlus Turbo 6 సిరీస్ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది. జనవరి 8న లాంచ్ తర్వాత ధర వివరాలు వెల్లడి కానున్నాయి.

Exit mobile version