OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్‌ప్లేతో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

  • 9,000mAh బ్యాటరీతో OnePlus 16
  • 185Hz డిస్‌ప్లే, 100W ఛార్జింగ్ ప్రత్యేకతలు
Oneplus 16 Launched In Chin

Oneplus 16 Launched In Chin

OnePlus 16 Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌తో మరోసారి చర్చలోకి వచ్చింది. OnePlus 16 చైనాలో అఫీషియల్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, భారీ 9,000mAh బ్యాటరీ, గరిష్ఠంగా 185Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతిచ్చే డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా గేమింగ్, కెమెరా పనితీరు, బ్యాటరీ బ్యాకప్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఫోన్ ధర, భారత మార్కెట్లో విడుదల తేదీ వంటి వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

OnePlus 16 కెమెరా ఫీచర్లు

OnePlus 16లో ప్రధానంగా 200MP ప్రైమరీ కెమెరా ఉండనుంది. దీనితో పాటు దూరంలోని వస్తువులను మరింత స్పష్టంగా ఫొటో తీయడానికి 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించారు. ఇక అల్ట్రా వైడ్ ఫోటోల కోసం 50MP కెమెరాతో వస్తోంది. ఈ మూడు కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించే అవకాశం ఉంది. కెమెరా వ్యవస్థలో Oppo అభివృద్ధి చేసిన LUMO Imaging టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు పేర్కొంటున్నారు.

9,000mAh భారీ బ్యాటరీ.. 100W ఫాస్ట్ ఛార్జింగ్

ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో ఫీచర్ 9,000mAh బ్యాటరీ. సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పోలిస్తే ఇది భారీ బ్యాటరీ సామర్థ్యం. ఎక్కువసేపు గేమ్స్ ఆడేవారు, వీడియోలు చూసేవారు, ఇంటర్నెట్ ఉపయోగించేవారికి ఇది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ: 9,000mAh
వైర్డ్ ఛార్జింగ్: 100W
వైర్‌లెస్ ఛార్జింగ్: 50W

ఇతర ఫీచర్లలో Master ట్యూనింగ్‌తో స్టీరియో స్పీకర్లు, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మెరుగైన వైబ్రేషన్ మోటార్ అందించారు.

185Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే

OnePlus 16లో BOEతో కలిసి అభివృద్ధి చేసిన నాలుగో తరం Oriental డిస్‌ప్లేను అందించారు. ఇది సాధారణ వినియోగంలో గరిష్ఠంగా 165Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. అనుకూలమైన గేమ్స్‌లో ఈ రిఫ్రెష్ రేట్ 185Hz వరకు పెరగవచ్చని పేర్కొంటున్నారు. అధిక రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్‌పై కదలికలు మరింత స్మూత్‌గా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వేగంగా స్పందించాల్సిన గేమ్స్‌లో ఇది ఉపయోగపడుతుంది. అయితే, 185Hz ప్రయోజనం పొందాలంటే సంబంధిత గేమ్ కూడా ఆ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇవ్వాలి.

గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి Fengchi Game Core, Super Display Chip P4, E-sports Network Chip G3, Lingxi Touch Chip T3 వంటి టెక్నాలజీలను అందించారు. అలాగే 800Hz గైరోస్కోప్, 6,428 చదరపు మి.మీ. VC కూలింగ్ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలం గేమ్స్ ఆడే సమయంలో ఫోన్ ఉష్ణోగ్రతను నియంత్రించడం, టచ్ స్పందనను మెరుగుపరచడం, నెట్‌వర్క్ స్థిరత్వానికి సహాయపడటం ఈ వ్యవస్థల లక్ష్యంగా ఉండవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా చైనా వెర్షన్‌లో Android 17 ఆధారిత ColorOS 17 అందించారు. గ్లోబల్ వెర్షన్‌లో సాఫ్ట్‌వేర్ వివరాలు వేరుగా ఉండే అవకాశం ఉంది.

ఇతర ఫీచర్లు ఇవి:

IP66, IP68, IP69, IP69K డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్
3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
IR బ్లాస్టర్
యాక్షన్ బటన్ లేదా షార్ట్‌కట్ కీ
USB 3.2 Gen 1
Wi-Fi 7
Bluetooth 6.0
NFC

డిజైన్, బరువు ఎంత?

ఆరెంజ్ వేరియంట్: 8.45 మి.మీ. మందం, 217 గ్రాముల బరువు
బ్లాక్ వేరియంట్: 8.50 మి.మీ. మందం, 220 గ్రాముల బరువు
వైట్ వేరియంట్: 8.55 మి.మీ. మందం, 220 గ్రాముల బరువు