OnePlus 15R vs Motorola Signature: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో వన్ ప్లస్ (OnePlus), మోటోరోలా (Motorola) కంపెనీలు కొత్త ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో గట్టి పోటీకి సిద్ధమయ్యాయి. వన్ ప్లస్ 15R (OnePlus 15R), మోటోరోలా సిగ్నేచర్ (Motorola Signature) రెండూ శక్తివంతమైన Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో వస్తుండగా.. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ధర పరంగా కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల మధ్య పూర్తి స్పెసిఫికేషన్ల తేడాను ఇప్పుడు చూద్దాం.
ప్రాసెసర్ & పనితీరు:
మోటోరోలా సిగ్నేచర్, వన్ ప్లస్ 15R రెండింటిలోనూ Qualcomm Snapdragon 8 Gen 5 చిప్‌సెట్ ఉంది. ఇది హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, ఏఐ ఆధారిత ఫీచర్లకు అనువైన పనితీరును అందిస్తుంది. ర్యామ్ పరంగా మోటోరోలా 12GB/16GB LPDDR5X ఆప్షన్లను అందిస్తే, OnePlus 15R 12GB LPDDR5X-Ultra ర్యామ్ తో వస్తుంది.
JSW Motors తొలి SUV ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో భారత మార్కెట్‌లోకి Jetour T2 i-DM..!
డిస్‌ప్లే:
మోటోరోలా సిగ్నేచర్ లో 6.8 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అదే వన్ ప్లస్ 15Rలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1800 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌తో పాటు HDR10+, HDR Vivid సపోర్ట్‌ను కలిగి ఉంది.
స్టోరేజ్:
మోటోరోలా సిగ్నేచర్ లో 256GB, 512GB, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. వన్ ప్లస్ 15R మాత్రం 256GB/512GB UFS 4.1 స్టోరేజ్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.
కెమెరా సెటప్:
మోటోరోలా సిగ్నేచర్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇది 8K @30fps, 4K @120fps, అలాగే 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ @60fpsకు సపోర్ట్ ఇస్తుంది. ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా ఉండి, 4K @60fps వీడియో రికార్డింగ్ అందిస్తుంది. వన్ ప్లస్ 15Rలో 50MP మెయిన్ కెమెరా (OISతో), 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 4K @120fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్‌లో 32MP కెమెరా ఉండి, 4K @30fps వీడియో రికార్డింగ్ అందిస్తుంది.
బ్యాటరీ & ఛార్జింగ్:
మోటోరోలా సిగ్నేచర్ లో 5,200mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 90W వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. మరోవైపు OnePlus 15Rలో భారీ 7,400mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 80W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, అయితే వైర్లెస్ ఛార్జింగ్ లేదు.
పవర్, స్టైల్, పెర్ఫార్మెన్స్తో జనవరి 29న చైనాలో REDMI Turbo 5 సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇలా..!
డ్యూరబిలిటీ & సాఫ్ట్‌వేర్:
Motorola Signatureకు IP68/IP69 రేటింగ్ ఉండగా.. OnePlus 15Rకు IP66/IP68/IP69 రేటింగ్ ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా రెండూ ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తాయి. మోటోరోలాలో హలో UI, OnePlusలో OxygenOS 16 అందించబడుతుంది.
ధర:
మోటోరోలా మొబైల్ ప్రారంభ ధర రూ. 59,999గా ఉండగా.. OnePlus 15R మాత్రం రూ. 47,999 ప్రారంభ ధరతో మరింత బెస్ట్ ప్రైసింగ్‌ను అందిస్తోంది.
ఏది బెస్ట్:
ప్రీమియం కెమెరా సెటప్, వైర్లెస్ ఛార్జింగ్, హై బ్రైట్‌నెస్ డిస్‌ప్లే కావాలనుకునే వారికి మోటోరోలా సిగ్నేచర్ (Motorola Signature) మంచి ఎంపిక. అదే భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ పనితీరు కోరుకునే వారికి వన్ ప్లస్ 15R (OnePlus 15R) మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
