Site icon NTV Telugu

మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్‌, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్‌ కు సిద్ధం..!

Nothing Phone (4a)

Nothing Phone (4a)

Nothing Phone (4a) Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ (Nothing) నుండి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4a) డిజైన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ పింక్, బ్లూ, బ్లాక్ కలర్‌లలో వస్తుందని కంపెనీ ప్రకటించగా.. తాజాగా కొత్త పింక్ కలర్ వెర్షన్‌ను ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ, డిజైన్‌లో వినూత్న మార్పులు తీసుకువచ్చింది.

The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్..

Nothing Phone (4a)లో ప్రధాన ఆకర్షణ కొత్త ‘Glyph’ లైటింగ్ సిస్టమ్. కెమెరా పక్కన కుడి వైపున నిలువుగా అమర్చిన 6 తెలుపు LED లైట్స్ ఉండనున్నాయి. అంతేకాకుండా.. ఒక రెడ్ కలర్ LED కూడా ఉంటుంది. ఇది వీడియో రికార్డింగ్ సమయంలో ఇండికేటర్‌గా పనిచేస్తుంది. ఈ Glyph లైట్స్ ద్వారా డాల్ఫిన్, వింగ్స్ వంటి ప్రత్యేక నోటిఫికేషన్ ఎఫెక్ట్స్‌తో పాటు Glyph ప్రోగ్రెస్, కెమెరా టైమర్ కౌంట్‌డౌన్, కెమెరా షట్టర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Tollywood Senior Heroes: సీనియర్స్ ను చూసైనా జూనియర్స్ నేర్చుకోండయ్యా.. సీనియర్ల జోరు మాములుగా లేదుగా!

Nothing Phone (4a)లో కెమెరా డిజైన్‌ను కూడా మెరుగుపరిచారు. Nothing Phone (3a)తో పోలిస్తే కెమెరా బంప్‌ను తగ్గించారు. ఈ ఫోన్‌లో టెట్రా ప్రిజమ్ టెలిఫోటో లెన్స్ ఉపయోగించడం వల్ల కెమెరా మాడ్యూల్ మరింత స్లిమ్‌గా ఉంటుంది. Nothing Phone (4a) అధికారిక లాంచ్ ఈవెంట్ మార్చి 5న లండన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.

Exit mobile version