NTV Telugu Site icon

Nokia G42 5G Smartphone: నోకియా నుంచి చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్.. మొబైల్ మార్కెట్‌లో సంచలనమే ఇక!

Nokia G42 5g

Nokia G42 5g

Nokia G42 5G and Nokia G310 5G Smartphone Launch: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. మరలా తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ పేరు నోకియా జీ42 5G (Nokia G42 5G). ఈ ఫోన్ ఇటీవల బెంచ్‌మార్కింగ్ సైట్‌లో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు బ్లూటూత్ SIG అథారిటీ డేటా బేస్‌లో ప్రత్యక్షం అయింది. అంతే కాకుండా నోకియా జీ310 5G (Nokia G310 5G) యొక్క స్పెసిఫికేషన్లు కూడా లీక్ అయ్యాయి.

Nokia G42 5G Display:
బ్లూటూత్ SIG లిస్టింగ్‌లో నోకియా జీ310 5G మోడల్ నంబర్ TA-1573 గా ఉంది. ఇక నోకియా జీ42 5G మోడల్ నంబర్ TA-1591/TA-1581. బ్లూటూత్ SIG.. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీకి సపోర్ట్‌ని వెల్లడించడమే కాకుండా రెండు ఫోన్‌ల బ్లూటూత్ లిస్టింగ్‌లు, వాటి కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ రెండూ ఫాన్స్ V- ఆకారపు నాచ్‌తో 6.5-అంగుళాల ఎల్సీడీ ప్యానెల్‌ను కలిగి ఉంటాయి. ఈ స్క్రీన్ ఎచ్‌డీ + రిజల్యూషన్ 720 x 1612 పిక్సెల్‌లు, 20: 9 యాస్పెక్ట్ రేషియో, 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు 560 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read: Joe Root Stumped Out: ఔట్ అయి కూడా.. అరుదైన రికార్డు నెలకొల్పిన జో రూట్!

Nokia G42 5G RAM:
నోకియా జీ310 5G, నోకియా జీ42 5G స్మార్ట్‌ఫోన్‌ల స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G చిప్‌సెట్ ఉంటుంది. ఈ రెండు ఫాన్స్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో ప్రీలోడెడ్‌గా వస్తాయి. గీక్‌బెంచ్‌ ప్రకారం నోకియా జీ42 5G ఫోన్ 4 GB RAMతో వస్తుంది. పలు నివేదికల ప్రకారం 6 GB RAM వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 128 GB వరకు స్టోరేజ్ ఎంపికను కలిగి ఉంటుంది.

Nokia G42 5G Battery:
ప్రస్తుతానికి నోకియా జీ310 5G, నోకియా జీ42 5G స్మార్ట్‌ఫోన్‌ల కెమెరా కాన్ఫిగరేషన్ మరియు బ్యాటరీ సామర్థ్యంపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఒకే విధమైన డిస్‌ప్లేలు మరియు చిప్‌సెట్‌లను కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌ల ఇతర స్పెసిఫికేషన్‌లు కూడా ఒకేలా ఉంటాయా లేదా భిన్నంగా ఉంటాయా అనేది ఇంకా తెలియరాలేదు.

Also Read: Ashes 2023: రసవత్తరంగా యాషెస్‌ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్‌కు 7 వికెట్లు!

Show comments