Google Grammar Check: ఇకపై గ్రామర్ తప్పులకు చెక్.. గూగుల్‌లో ప్రత్యేక ఫీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Grammar Check: మనం ఒక ప్రాంతం నుంచి కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే.. ఆ ప్రాంతం మనకు తెలియకపోయినా మన స్మార్ట్ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని ఆ ప్రాంతానికి వెళతాం. ఇక చదువకునే విద్యార్థులు.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. ఇక ఇంగ్లీష్‌లో అయితే మనకు తెలియని పదం నుంచి.. తెలియని విషయాల వరకు సెర్చ్ చేసి తెలుసుకుంటాం. మనకు ఏది తెలియకపోయినా.. వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. ఇలా ప్రతిదానికి గూగుల్‌పై ఆధారపడుతున్నాము. గూగుల్ కూడా కొత్త కొత్త ఫీచర్లను కనిపెడుతూ వినియోగదారులకు దగ్గరవుతోంది. ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్‌ను సైతం కనిపెట్టింది. అదేమిటంటే ఇంగ్లీష్‌లో మనం చేసే గ్రామర్ మిస్టేక్‌లను మనమే సరి చేసుకోవడం. అదీ గూగుల్ సెర్చ్ ద్వారా.. అదెలా అంటే..
Read also: Rajinikanth: అతను నీలాంబరి ముందు నరసింహా పరువు తీశాడు..
Also Read
- OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ఇంగ్లీషులో గ్రామర్ మిస్టేక్స్ చేసేవారు గణనీయంగా ఉంటారు. ఇంగ్లీష్ పాఠాలు బోధించే అధ్యాపకులు సైతం అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు. ఇంగ్లీష్ గ్రామర్‌లో తప్పులు చేసే వారి సంఖ్య భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటి నుంచి రిలీప్ పొందడానికి ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. గూగుల్ తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారుల కోసం ‘గ్రామర్ చెక్ ఫీచర్’ను కొత్తగా తీసుకువచ్చింది. అయితే ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఇతర భాషలకు అందుబాటులో ఉండనుందని గూగుల్ ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఒక వాక్యం గ్రామర్ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఈ ఫీచర్ ద్వారా నేరుగా మనం రాసిన గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అందులో వాక్యాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవడానికి ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ఈ కొత్త ఫీచర్ ఉపయోగించడంతో చాలా సులభంగా గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రతి సారీ గ్రామర్ చెక్ కోసం పేజ్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.. దానిని ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది. దాని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది.. అందులో ఏదైనా తప్పు ఉంటే వెంటనే రెడ్ మార్క్ చూపిస్తుంది. ఇందులో గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తుంది ఈ ఫీచర్. గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ కంప్యూటర్లతోపాటు స్మార్ట్ఫోన్లలోనూ ఉపయోగింకునే వీలుంది.
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!