Site icon NTV Telugu

Orion Spacecraft: చంద్రుడికి చేరువలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్..

Orion Spacecraft

Orion Spacecraft

NASA Orion spacecraft makes closest flyby of Moon at 130 kms distance: నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆర్టెమిస్-1 రాకెట్ ప్రమోగం సక్సెస్ అయింది. రాకెట్ మోసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ఓరియన్ చంద్రుడికి చేరువైంది. నవంబర్ 21న చంద్రుడికి అతి సమీపం నుంచి పరిభ్రమించింది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. జాబిల్లి ఉపరితం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో నుంచి ప్రయాణించిందని నాసా వెల్లడించింది. వ్యోమరహిత నౌక అయిన ఆర్టెమిస్-1 మిషన్ లో భాగంగా ఓరియన్ తన మొదటి మూన్ ఫ్లైబైని విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగం జరిగిన ఆరు రోజుల తర్వాత ఓరియన్ వ్యోమనౌక తన నాలుగో కక్ష్య సవరింపులను చేసుకుంది. ఓరియన్ లోని ఆక్సిలరీ ఇంజిన్‌లను ఉపయోగించి చంద్రుడి సుదూర తిరోగమన కక్ష్యలోకి మారేందుకు కావాల్సిన విన్యాసాలను చేసింది. ఈ కక్ష్య ఓరియన్ కు మరింత స్థిరత్వాన్ని అందిస్తుందని నాసా వెల్లడించింది. ఈ కక్ష్యలో ఉండటానికి తక్కువ ఇంధనం ఖర్చవుతుందని తెలిపింది.

Read Also: Uttar Pradesh: మేము అధికారంలోకి వస్తే “మీరట్” పేరును “నాథూరామ్ గాడ్సే నగర్”గా మారుస్తాం.

ఓరియన్ నవంబర్ 25 చంద్రుడికి అత్యంత సుదూర బిందువును దాటి 57,287 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. గతంలో అపోలో 13 నెలకొల్పిన రికార్డును అధిగమించనుంది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. ఓరియన్ భూమి నుంచి 2,16,842 మైళ్లు ప్రయాణించింది, ప్రస్తుతం చంద్రుడి నుండి 13,444 మైళ్ల దూరంలో ఉంది. గంటకు 3,489 మైళ్ల వేగంతో ప్రయాణించి భూమి నుంచి చంద్రుడి వద్దకు చేరింది. ఆర్టెమిస్-1 నాసా స్పేస్ లాంచింగ్ సిస్టమ్స్(ఎస్ఎల్ఎస్) ఇంటిగ్రేటెడ్ రాకెట్ తొలి ప్రయోగం. వ్యోమగాములు లేకుండా ఓరియన్ అంతరిక్ష నౌక ప్రయోగాన్ని చేపట్టింది. పలుమార్లు వాయిదా పడినప్పటికీ గతం వారం ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది నాసా.

చివరి సారిగా 1972లో వ్యోమగాములతో అపోలో-17 మిషన్ మూన్ మిషన్ ని నాసా చేపట్టింది. ఆ తరువాత 2025లో వ్యోమగాములతో కూడిన మూన్ ల్యాండింగ్ మిషన్ ప్రారంభించాలని నాసా యోచిస్తోంది. ఈ ప్రయోగంలో ఓ మహిళ ఆస్ట్రోనాట్ కూడా ఉండనున్నట్లు నాసా వెల్లడించింది. ఇదే జరిగితే చంద్రుడిపై కాలుపెట్టిన తొలి మహిళగా రికార్డుకెక్కే అవకాశం ఉంటుంది. ఆర్టిమిస్-1 మానవ చంద్రుడి అంతరిక్ష యాత్రకు పునాది వేస్తుందని నాసా భావిస్తోంది.

Exit mobile version