Site icon NTV Telugu

FIFA World Cup 2026 స్పెషల్ ఎడిషన్ Motorola Razr.. జనవరి 6న గ్రాండ్ లాంచ్‌కు సిద్ధం..!

Fifa World Cup 2026 Motorola Razr

Fifa World Cup 2026 Motorola Razr

FIFA World Cup 2026 Motorola Razr: మోటరోలా ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026)కు అనుసంధానంగా ప్రత్యేక మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది మోటోరోలా సంస్థ. ఈ స్పెషల్ ఎడిషన్ లాంచ్‌ను జనవరి 6న నిర్వహించనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అదే రోజున మోటరోలా సిగ్నేచర్ ఫ్లాగ్‌షిప్ కూడా విడుదల కానున్నది.

Moonglet Recipe: ప్రోటీన్ రిచ్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. గ్రీన్ చట్నీతో టేస్టీ మూంగలెట్ తయారీ మీకోసం..!

మోటోరోలా US అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా విడుదలైన టీజర్ వీడియోలో రియర్ ప్యానెల్‌పై FIFA World Cup 2026 లోగోతో ఉన్న మోటరోలా రేజర్ డిజైన్‌ను కంపెనీ చూపించింది. ఈ వీడియోతో పాటు లాంచ్ టైమింగ్‌ను కూడా మోటరోలా ఖరారు చేసింది. జనవరి 6న ఇప్పటికే మోటరోలా తన కొత్త ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను గ్లోబల్‌గా ఆవిష్కరించనుంది. ఈ ఫోన్‌ను ముందుగా Motorola Edge 70 Ultraగా గుర్తించారు. కానీ ఇప్పుడు దీనిని ‘మోటోరోలా సిగ్నేచర్’ పేరుతో లాంచ్ చేయనున్నారు. అదే ఈవెంట్‌లో మోటోరోలా రేజర్ FIFA World Cup 2026 ఎడిషన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

JanaNayaganTrailer : జననాయగన్ రీమెక్ కాదన్నారు.. కానీ భగవంత్ కేసరిని కాపీ పేస్ట్ చేశారు..

ఈ ఫిఫా వరల్డ్ కప్ 2026 బ్రాండింగ్‌తో రానున్న ఈ స్పెషల్ రేజర్ మోడల్, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Motorola Razr 60కి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. అయితే హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌లో ఏవైనా మార్పులు ఉంటాయా అనే విషయాన్ని మోటరోలా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. పూర్తి వివరాలు జనవరి 6 లాంచ్ ఈవెంట్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిస్టింగ్స్ ప్రకారం మోటోరోలా రేజర్ 60 256GB+8GB ధర 399 డాలర్స్ గా ఉంది. పూర్తి స్పెసిఫికేషన్లు, ప్రాంతాల వారీగా లభ్యత, ధరల వివరాలు అన్నీ జనవరి 6 లాంచ్ ఈవెంట్లో వెల్లడించనున్నారు.

Exit mobile version