క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!
- క్వాడ్-కర్వ్ ప్రీమియం డిజైన్
- మిలిటరీ గ్రేడ్ మన్నిక
- Sony LYTIA 710 కెమెరా, మోటో AI ఫీచర్లు..
Motorola Edge 70 Fusion Launched: మోటరోలా తన ‘ఎడ్జ్’ (Edge) సిరీస్ లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Edge 70 Fusion)ను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, సరికొత్త సోనీ కెమెరా సెన్సార్ టెక్నాలజీ, అద్భుత ఆన్-డివైస్ AI ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుక వచ్చింది మోటోరోలా. మరి ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ విశేషాలను ఇక్కడ చూసేద్దాం..
క్వాడ్-కర్వ్ డిజైన్:
ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ‘క్వాడ్-కర్వ్’ డిజైన్ తో వస్తుంది. ఇందులో ఫోన్ ముందు, వెనుక భాగాలు వంపు తిరిగి ఉండటంతో ఇది చేతిలో పట్టుకోవడానికి సౌకర్యంగా, స్మూత్‌గా అనిపిస్తుంది. నైలాన్, లినెన్ మెటీరియల్స్ నుండి ప్రేరణ పొందిన టెక్స్చర్ ఫినిషింగ్ దీని లుక్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది ఓరియంట్ బ్లూ, స్పోర్టింగ్ గ్రీన్, సిల్హౌట్ వంటి పాన్టోన్ షేడ్స్ లో అందుబాటులో ఉంటుంది. మన్నిక పరంగా IP68 + IP69 రేటింగ్స్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణను కూడా కలిగి ఉంది.
Also Read
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- 5G Smart Phones Under 15000: 7,000 mAh బ్యాటరీ.. హైటెక్ ఫీచర్లతో, 15,000 బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
- Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
- Redmi Pad 2: రెడ్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!
సోనీ సెన్సార్‌తో కెమెరా విభాగం:
ప్రపంచంలోనే మొదటిసారిగా Sony LYTIA 710 సెన్సార్‌ను ఈ ఫోన్‌లో ఉపయోగించారు. 50MP ప్రధాన కెమెరా OIS సపోర్ట్‌తో వస్తూ, తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోలు తీసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనితోపాటు 13MP అల్ట్రావైడ్, మాక్రో లెన్స్ (122° ఫీల్డ్ ఆఫ్ వ్యూ) అందించారు. 32MP ఫ్రంట్ కెమెరా 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులోని “మోటో ఏఐ” ఫోటో ఎన్‌హాన్స్మెంట్ ఇంజిన్ చిత్రాలను ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేసి ప్రొఫెషనల్ క్వాలిటీ అందిస్తుంది.
డిస్‌ప్లే & ఆడియో:
ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల ఎక్స్ట్రీమ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K సూపర్ HD రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో గరిష్టంగా 5200 నిట్స్ బ్రైట్‌నెస్ అందించడం ద్వారా మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా స్పష్టమైన వీయింగ్ అనుభవం ఇస్తుంది. ఆడియో కోసం డాల్బీ ఐటమ్స్ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందించారు.
ప్రాసెసర్, భారీ బ్యాటరీ:
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమింగ్, AI ఆధారిత టాస్క్ లను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది ఆప్టిమైజ్ చేయబడింది. మార్కెట్ ను బట్టి 5200mAh లేదా 7000mAh బ్యాటరీ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. ఇవి సుమారు 39 నుంచి 52 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తాయని కంపెనీ తెలిపింది. 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ పవర్ షేరింగ్ ఫీచర్ కూడా ఉంది.
స్మార్ట్ ఫీచర్స్:
ఈ స్మార్ట్ ఫోన్ లో మోటరోలా సొంత AI టూల్స్‌ను సమగ్రంగా పొందుపరిచింది. “నెక్స్ట్ మూవ్” ఫీచర్ యూజర్ స్క్రీన్‌పై చూస్తున్న కంటెంట్‌ను విశ్లేషించి తర్వాత ఏమి చేయాలో సూచిస్తుంది. ఇక జెనెరేటివ్ టూల్స్ ద్వారా ప్లేలిస్ట్ స్టూడియో, ఇమేజ్ స్టూడియో సహాయంతో కస్టమ్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌లు, స్టిక్కర్లు, వాల్‌పేపర్లు రూపొందించవచ్చు. “క్యాచ్ మీ అప్” వంటి స్మార్ట్ కమాండ్స్ నోటిఫికేషన్లను సమ్మరైజ్ చేసి సమయం ఆదా చేస్తాయి.
64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!
ధర:
ఈ మొబైల్ ప్రారంభ ధర 429.99 యూరోలు (రూ. 46,075)గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ లాటిన్ అమెరికా, EMEA (యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉండగా.. మోటరోలా ఇప్పటికే భారత మార్కెట్‌లో ఈ ఫోన్‌ను మార్చి 6న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అదే రోజు నుంచి ఎర్లీ బర్డ్ సేల్ కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా గ్లోబల్ వెర్షన్‌లో ఉన్న Snapdragon 7s Gen 3 చిప్‌సెట్‌కు బదులుగా.. భారతీయ వెర్షన్‌లో మరింత శక్తివంతమైన Snapdragon 7s Gen 4 SoC అందించనున్నారు.
తాజావార్తలు
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!