NTV Telugu Site icon

Smartphones: చౌక ధరకే స్మార్ట్ ఫోన్లు.. రూ. 10 వేలలోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Smartphone

Smartphone

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. రూ. 10 వేలలోపు మంచి కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్‌ప్లే వంటి ఫీచర్లు తో వస్తున్నాయి. టాప్ క్లాస్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈమధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ. 10 వేలలోపు ధరలో ఐటెల్, రియల్ మీ, ఇన్ఫినిక్స్, రెడ్ మీ బ్రాండ్ కు చెందిన మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: Mamata Banerjee: హిందూ పండగకు సెలవు రద్దు, రంజాన్‌కి కేటాయింపు.. మమతా బెనర్జీపై బీజేపీ ఫైర్

ఐటెల్ కలర్ ప్రో 5G

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఐటెల్ కలర్ ప్రో 5G రూ. 8,205కే వచ్చేస్తోంది. ఐటెల్ కలర్ ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఐటెల్ ఫోన్ 5000mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read:AP Politics: మేము కూటమిగా కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు

ఇన్ఫినిక్స్ హాట్ 50 5G

రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇన్ఫినిక్స్ బ్రాండ్ కు చెందిన ఇన్ఫినిక్స్ హాట్ 50 5Gపై ఓ లుక్కేయండి. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ. 9,499గా ఉంది. ఈ Infinix ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో 4GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 6.7 అంగుళాలు. ఇది HD+ IPS LCD ప్యానెల్. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోన్‌లో 48 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

Also Read:CM Revanth Reddy : ప్రధానమంత్రితో కులగణపై చర్చ జరగలేదు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD

ఫ్లిప్ కార్ట్ లో ఇన్ఫినిక్స్ నుంచి మరో ఫోన్ రూ. 10 వేల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD ధర రూ. 6,699గా ఉంది. ఈ ఫోన్‌లో MediaTek యొక్క Helio G50 ప్రాసెసర్, 3GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది.

Also Read:Centre To Supreme: “రాజకీయ దోషుల” జీవితకాల నిషేధంపై కేంద్రం సంచలన నిర్ణయం..

రియల్మీ నార్జో N63

తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ నార్జో N63పై ఓ లుక్కేయండి. ఫ్లిప్ కార్ట్ లో రియల్మీ నార్జో N63 ధర రూ. 8,599గా ఉంది. realme Narzo N63 స్మార్ట్‌ఫోన్‌లో Unisoc T612 ప్రాసెసర్‌తో 4GB RAM ఉంది. ఈ ఫోన్ 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్‌లో 50 MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ రియల్‌మీ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. సూపర్ VOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.