రూ.7,499కే IP64 రేటింగ్, Unisoc ప్రాసెసర్‌తో Lava Bold N2 లాంచ్.. ఫీచర్స్ ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Bold N2 Launch: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ తన బోల్డ్ సిరీస్ లో భాగంగా కొత్తగా లావా బోల్డ్ N2 (Lava Bold N2)ను లాంచ్ చేసింది. గత ఏడాది వచ్చిన Bold N1కు వారసుడిగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపకల్పన చేశారు. దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్‌తో పాటు ఆకర్షణీయమైన గ్లోసీ బ్యాక్ డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.
కొత్త డిజైన్, స్మూత్ యానిమేషన్లతో Android 17 Beta.. ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసా?
Also Read
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
- ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
- స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
- Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
డిస్ప్లే & పనితీరు:
లావా బోల్డ్ N2లో 6.75 అంగుళాల HD+ (720 x 1600 పిక్సెల్స్) LCD డిస్ప్లేను అందించారు. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, యాప్ నావిగేషన్ సాఫీగా ఉంటుంది. ఈ ఫోన్ 1.6GHz ఆక్టా-కోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB RAMతో పాటు 4GB వరకు వర్చువల్ గా పెంచుకునేందుకు సపోర్ట్ ఉంది. 64GB స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ మైక్రోSD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్ పై నడుస్తుంది.

కెమెరా ఫీచర్లు:
ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు LED ఫ్లాష్ అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సాధారణ రోజువారీ యూజ్‌కు సరిపడే కెమెరా సెటప్‌ను ఇందులో ఇచ్చారు.
బ్యాటరీ & ఇతర ఫీచర్లు:
Lava Bold N2లో 5000mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి కేవలం 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో USB Type-C పోర్ట్ ద్వారా చార్జ్ అవుతుంది. ఇక ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 4.2 లు ఉన్నాయి.
ధర:
Lava Bold N2 ఇండస్ బ్లాక్, సియాచిన్ వైట్ రంగుల్లో లభిస్తుంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ. 7,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఒక సంవత్సరం వారంటీతో పాటు ఉచిత హోమ్ సర్వీస్ సదుపాయం కూడా అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!