Smart Projectors లివింగ్ రూమ్‌లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు ఆ బిగ్ స్క్రీన్ అనుభూతి కోసం వేలకు వేలు పోసి పెద్ద టీవీలు కొనాలని ఆలోచిస్తున్నారా? ఇకపై ఆ ఖర్చులన్నీ పక్కన పెట్టేయొచ్చు. కేవలం ఒక చిన్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కంటే తక్కువ ధరకే ఇంట్లోనే ఏకంగా 120 నుంచి 130 అంగుళాల సినిమా థియేటర్ స్క్రీన్ ఏర్పాటు చేసుకునే అవకాశం వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జస్ట్ క్రోసికా మార్కెట్లోకి తీసుకొచ్చిన సరికొత్త ప్రొజెక్టర్లు ఇప్పుడు టెక్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి.
జేబుకు చిల్లు పడకుండా బిగ్ స్క్రీన్ మజా!
సాధారణంగా 65 లేదా 75 అంగుళాల స్మార్ట్ టీవీ కొనాలంటే మార్కెట్లో కనీసం రూ. 50 వేల నుంచి లక్ష వరకు పెట్టాల్సి వస్తుంది. కానీ, జస్ట్ క్రోసికా లాంచ్ చేసిన ‘జేసీ స్టూడియోక్స్ (JST 830)’, ‘జేసీ స్టూడియోక్స్ ప్రో (JST 832)’ ప్రొజెక్టర్లతో ఆ తిప్పలన్నీ తప్పనున్నాయి. కేవలం రూ. 6,999 ప్రారంభ ధరకే ఈ సరికొత్త హోమ్ థియేటర్ అనుభవం అందుబాటులోకి వచ్చింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు కంపెనీ అధికారిక పోర్టల్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
జేసీ స్టూడియోక్స్ (రూ. 6,999):
ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన జేసీ స్టూడియోక్స్ రోజువారీ ఎంటర్టైన్మెంట్ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. తెల్లటి గోడ లేదా కర్టెన్పై ఏకంగా 40 నుంచి 120 అంగుళాల వరకు బిగ్ స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేయగలదు. స్క్రీన్ యాంగిల్ వంకరగా రాకుండా దానంతట అదే సర్దుబాటు చేసుకునే ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్ ఇందులో ఉండటం విశేషం. ఆండ్రాయిడ్ 11తో పనిచేసే ఈ డివైజ్‌లో 4K కంటెంట్ సపోర్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్‌లు నేరుగా రన్ అవుతాయి. H713 క్వాడ్-కోర్ ARM కార్టెక్స్-A53 ప్రాసెసర్, 1GB ర్యామ్, 8GB స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, 3W ఇన్-బిల్ట్ స్పీకర్, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టులను అందించారు.
జేసీ స్టూడియోక్స్ ప్రో (రూ. 10,999):
ఇంకొంచెం ఎక్కువ బ్రైట్నెస్, అడ్వాన్స్డ్ ఫీచర్లు కోరుకునే వారి కోసం స్టూడియోక్స్ ప్రోను తీసుకొచ్చారు. ఫుల్ హెచ్డీ నేటివ్ రిజల్యూషన్, 350 ఏఎన్ఎస్ఐ ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో 40 నుంచి 130 అంగుళాల భారీ స్మార్ట్ స్క్రీన్‌ను ఇది అందిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ఫోకస్, ఆటో కీస్టోన్ దిద్దుబాటుతో పాటు 360-డిగ్రీల రొటేషన్ డిజైన్ ఉండటం వల్ల గదిలో ఎక్కడి నుంచైనా సులువుగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12పై నడిచే ఈ ప్రో మోడల్.. లేటెస్ట్ వైఫై 6 టెక్నాలజీ, బ్లూటూత్ 5.4, వైర్లెస్ స్క్రీన్ మిర్రరింగ్, 3W ఆడియోతో లభిస్తుంది. హాల్లో ఒక తెల్లటి గోడ ఉంటే చాలు.. వేల రూపాయల టీవీలు అక్కర్లేకుండా, అతి తక్కువ బడ్జెట్లోనే కుటుంబమంతా కలిసి మల్టీప్లెక్స్ ఫీలింగ్‌ను ఆస్వాదించవచ్చు.

