JioPhone 5G Smartphone Launch and Price in India: ‘రిలయన్స్ జియో’ తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జియో ఫోన్ 5జీ (JioPhone 5G) పేరుతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది. గూగుల్‌తో కలిసి 5G ఫోన్‌ను తయారు చేస్తున్నట్లు జియో గతంలోనే వెల్లడించింది. ఇది జియో యొక్క రెండవ స్మార్ట్‌ఫోన్. కంపెనీ ఇప్పటికే 4G కనెక్టివిటీతో మొదటి ఫోన్ విడుదల చేసింది. అయితే జియో ఫోన్ 5జీ విడుదల తేదీని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇటీవల జియో ఫోన్ 5G గురించి చాలా సమాచారం లీక్ అయింది. ఆ వివరాలు ఓసారి చూద్దాం.
JioPhone 5G Price:
పలు నివేదికల ప్రకారం జియో ఫోన్ 5G దీపావళికి లేదా ఈ ఏడాది చివర్లో గానీ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర భారతదేశంలో 10 వేల రూపాయల కంటే తక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇది జియో ఫోన్ 4G లాంచ్ ధర రూ. 6,499 కంటే తక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ పలు వేరియెంట్స్ ధరలు రూ.8 నుంచి 12 వేల మధ్య ఉండొచ్చని సమాచారం. దాంతో ఇది భారతదేశంలో అత్యంత సరసమైన 5G ఫోన్ ఇదే కానుంది.
Also Read: Upcoming 5G Smartphones: జూలైలో విడుదల కానున్న టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!
JioPhone 5G Camera:
జియో ఫోన్ 5G బ్యాక్ కెమెరా 13 ఎంపీ + 2 ఎంపీ కెమెరా ఉండనుంది. ఫ్రంట్ కెమెరా 5 ఎంపీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. లీకైన ఫొటోస్ ప్రకారం.. ఈ ఫోన్ ముందువైపు వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్ కనిపిస్తోంది. కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ మధ్యలో జియో లోగో ఉంటుంది. లోగో కింద ‘అల్టిమేట్ స్పీడ్, అన్‌లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్’ అనే క్యాప్షన్ రాసి ఉంది. 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోందని సమాచారం.
JioPhone 5G Battery:
జియో ఫోన్ 5G స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, డ్యూయల్ సిమ్ స్లాట్ ఉండనున్నాయి.
Also Read: IND vs PAK: 7 ఏళ్ల తర్వాత భారత్‌కు పాకిస్తాన్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?