Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Recharge: టెలికాం రంగంలో పోటీ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తన ప్రీపెయిడ్ వినియోగదారులకు మరోసారి అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన కస్టమర్లకు Buy 1 Get 1 Free ప్రమోషనల్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద అర్హత కలిగిన వినియోగదారులు రూ.299 లేదా రూ.349 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. అదే విలువ కలిగిన మరో రీఛార్జ్ వోచర్‌ను ఉచితంగా పొందవచ్చు.
జియో అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు అదనంగా డబ్బులు చెల్లించకుండానే మరో నెల రోజుల పాటు సేవలను పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులు కాగా, ఉచిత వోచర్‌ను కూడా వినియోగించుకుంటే మొత్తం 56 రోజుల వరకు ప్రయోజనం పొందవచ్చు. జియో రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. అంటే 28 రోజుల వ్యాలిడిటీకి మొత్తం 42GB డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే అర్హత కలిగిన వినియోగదారులకు మరో రూ.299 రీఛార్జ్ వోచర్ ఉచితంగా లభిస్తుంది.
Also Read
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
- 7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
- Vivo T5e: వివో T5e స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 48% తగ్గింపుతో రూ.13,999కే.. 5500mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లే
మరోవైపు రూ.349 ప్లాన్‌లో రోజుకు 2GB డేటాతో పాటు అర్హత నిబంధనలకు లోబడి అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం లభిస్తుంది. అదేవిధంగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు అందిస్తారు. ఈ ప్లాన్‌పై ఆఫర్ వర్తించే వినియోగదారులకు మరో రూ.349 రీఛార్జ్ వోచర్ ఉచితంగా లభిస్తుంది. దీంతో రెండు రీఛార్జ్‌ల ద్వారా మొత్తం 56 రోజుల వరకు సేవలను పొందవచ్చు. అయితే ఈ Buy 1 Get 1 Free ఆఫర్ అందరికీ వర్తించదు. జియో ఎంపిక చేసిన మొబైల్ నంబర్లకు మాత్రమే అందిస్తోంది. కాబట్టి మీ నంబర్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి ముందుగా MyJio యాప్‌ను ఓపెన్ చేసి మీ జియో నంబర్‌తో లాగిన్ కావాలి. హోమ్‌పేజీలో కనిపించే ప్రమోషనల్ బ్యానర్లో Buy One Get One Free ఆఫర్ ఉందో లేదో చూడాలి. లేదంటే Recommended Plans for You విభాగంలో రూ.299, రూ.349 ప్లాన్ల పక్కన ఈ ఆఫర్‌కు సంబంధించిన బ్యాడ్జ్ కనిపిస్తుందేమో చెక్ చేయాలి.
ఆఫర్ అందుబాటులో ఉంటే సంబంధిత ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ పూర్తయిన తర్వాత ఏడు రోజుల్లోపు ఉచిత వోచర్ MyJio యాప్‌లోని Vouchers విభాగంలో క్రెడిట్ అవుతుంది. అక్కడికి వెళ్లి వోచర్‌ను పరిశీలించి వినియోగించుకోవచ్చు. ప్రధాన నంబర్‌పై ఈ ఆఫర్ కనిపించకపోతే, మీ వద్ద ఉన్న మరో జియో సిమ్‌తో MyJio యాప్‌లో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కొంతకాలంగా వినియోగంలో లేని సెకండరీ సిమ్‌లకు టెలికాం సంస్థలు తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్లు అందించే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి నంబర్లకు ఈ ఆఫర్ తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం. మొత్తంగా జియో అందిస్తున్న ఈ Buy 1 Get 1 Free ఆఫర్‌కు అర్హత ఉన్న వినియోగదారులు ఒకే రీఛార్జ్‌తో మరో నెల రోజుల ప్రయోజనాన్ని పొందవచ్చు.
తాజావార్తలు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
AP MPP, ZPP Indirect Elections 2026: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. MPP, ZPP ఎన్నికల తేదీలు ఖరారు!
-
Ramayana Box Office Collections: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!