3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z11 5G: తాజాగా iQOO Z11 Lite, iQOO Z11x 5G మోడళ్లను తీసుకొచ్చిన ఐక్యూ (iQOO) కంపెనీ భారత మార్కెట్లో తన Z సిరీస్‌ను మరింత పెంచుకునేలా ఇప్పుడు స్టాండర్డ్ iQOO Z11 5Gను భారత మార్కెట్లో విడుదల చేయబోతుంది. ఈ ఫోన్ ఆగస్టులో లాంచ్ అయ్యే అవకాశముందని తాజా లీక్‌లు చెబుతున్నాయి.
తాజా లీక్‌ల ప్రకారం.. భారత మార్కెట్లో విడుదలయ్యే iQOO Z11 5Gలో MediaTek Dimensity 7500 Turbo ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ కొత్త ఆక్టా-కోర్ చిప్‌తో భారత్‌లో లాంచ్ కానున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. అయితే, చైనాలో విడుదలైన iQOO Z11లో MediaTek Dimensity 8500 చిప్‌సెట్‌ను ఉపయోగించారు.
Also Read
- Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
- TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే:
భారత వెర్షన్లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ డిజైన్ కారణంగా ఫోన్ మరింత ప్రీమియం లుక్‌ను అందించనుంది. అధికారికంగా డిస్ప్లే స్పెసిఫికేషన్లు వెల్లడించకపోయినా, చైనా మోడల్లో ఉన్న ఫీచర్లు ఇందులో కూడా ఉండే అవకాశముంది.
165Hz రిఫ్రెష్ రేట్:
చైనాలో విడుదలైన iQOO Z11లో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR సపోర్ట్ ఉన్నాయి. భారత మోడల్లో కూడా వీటిలో చాలా ఫీచర్లు కొనసాగించే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
50MP OIS కెమెరా :
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు 2MP సెకండరీ సెన్సార్, సెల్ఫీలు అండ్ వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించవచ్చని సమాచారం.
9,020mAh బ్యాటరీ:
చైనా మోడల్లో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత 9,020mAh బ్యాటరీ. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అయితే భారత వెర్షన్లో ఇదే భారీ బ్యాటరీ కొనసాగుతుందా? లేక కొద్దిగా తక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందిస్తారా? అనే విషయంపై కంపెనీ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.
లాంచ్..
iQOO ఇప్పటివరకు భారత లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే ఆగస్టులో ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని లీక్‌లు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో టీజర్లు, అధికారిక స్పెసిఫికేషన్లు, ధర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర CNY 2,299 (రూ.31,200)గా ఉంది. భారత మార్కెట్లో ధర ఎంత ఉండబోతుందో లాంచ్ సందర్భంగా వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?