9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- ఐక్యూ నియో11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్
- 9,100mah భారీ బ్యాటరీ
- 6.83 అంగుళాల 2కే+ అమోలెడ్ డిస్ప్లేతో పాటు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్..
- మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎం ప్రాసెసర్
- గేమింగ్ పనితీరు కోసం ఐక్యూ క్యూ2 గేమింగ్ చిప్, 8కే ఐస్ డోమ్ 8K Ice Dome 3D VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్..
- 50MP సోనీ ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా..
- IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Neo11 Ultra: చైనాలో ఐక్యూ (iQOO) నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లో కొత్త ప్రీమియం పెర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూ నియో11 అల్ట్రా (iQOO Neo11 Ultra)ను అధికారికంగా విడుదల చేసింది. గేమింగ్, పనితీరు, బ్యాటరీ లైఫ్‌పై ప్రత్యేక దృష్టితో తయారైన ఈ ఫోన్లో కొత్త Dimensity 9500M ప్రాసెసర్, 9,100mAh భారీ బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
డిజైన్:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో హారిజాంటల్ కెమెరా డెకో లేఅవుట్‌ను అందించారు. హారిజాంటల్గా గేమ్స్ ఆడే సమయంలో ఫోన్‌ను మరింత స్థిరంగా పట్టుకునేందుకు ఈ డిజైన్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. 9.13mm పెద్ద R-angle కర్వ్, AG మైక్రో-ఫ్రాస్టెడ్ మ్యాట్ గ్లాస్ బ్యాక్, ఫింగర్ప్రింట్లు, జారిపోవడాన్ని తగ్గించే లో-టెంపరేచర్ మ్యాట్ మెటల్ ఫ్రేమ్ ఉన్నాయి. ఈ ఫోన్ విండ్ చేజర్, షాడో బ్లాక్, లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Also Read
- Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
- రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
ప్రాసెసర్:
ఈ స్మార్ట్ ఫోన్ లో పనితీరు కోసం 3nm ప్రాసెస్‌పై తయారైన మీడియాటెక్ డిమెంసిటీ 9500M ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4.21GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Arm Mali-G1 Ultra MC12 GPU ఉంది. దీనికి 12GB లేదా 16GB LPDDR5X Ultra RAM, 256GB లేదా 512GB UFS 4.1 స్టోరేజ్ జతగా ఉన్నాయి. గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు iQOO Q2 గేమింగ్ చిప్‌ను కూడా అందించింది. ఇది 2K సూపర్-రిజల్యూషన్, కొత్త మాన్స్టర్ ఇంజిన్ కు సపోర్ట్ చేస్తుంది.

8K ఐస్ డోమ్ కూలింగ్:
గేమింగ్, హెవీ టాస్క్‌ల సమయంలో ఫోన్ ఎక్కువగా వేడెక్కకుండా ఉండేందుకు 8K Ice Dome 3D VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. ఎక్కువసేపు గేమింగ్ చేసినా స్థిరమైన పనితీరును అందించడమే దీని లక్ష్యం.
AMOLED డిస్ప్లే:
ఈ ఫోన్లో 6.83 అంగుళాల 2K+ Visionox F2 LTPS AMOLED డిస్ప్లే ఉంది. ఇది 3200 × 1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. HDR10+, 1.07 బిలియన్ కలర్స్, DCI-P3 కలర్ గ్యామట్కు సపోర్ట్ ఉంది. ఫుల్-స్క్రీన్ బ్రైట్నెస్ 2,000 నిట్స్ కాగా, లోకల్ పీక్ బ్రైట్నెస్ 4,500 నిట్స్ వరకు ఉంటుంది. కనీస బ్రైట్నెస్ 1 నిట్ వరకు తగ్గించుకోవచ్చు. కళ్ల రక్షణ కోసం సర్క్యూలర్ల్య్ పోలరైజ్డ్ లైట్ 2.0 టెక్నాలజీని అందించారు. మల్టీ-ఫింగర్ టచ్ కోసం 500Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ ఉంది. వీటితోపాటు 2,592Hz PWM డిమ్మింగ్ కూడా ఉంది.
50MP ప్రధాన కెమెరా:
కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ LYTIA 700V ప్రధాన కెమెరా ఉంది. ఇది 1/1.56 అంగుళాల సెన్సార్, f/1.88 అపెర్చర్, OISతో వస్తుంది. CIPA 4.5-లెవల్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ ఉంది. దీనికి 8MP ఓమ్ని విజన్ OV08F10 అల్ట్రా-వైడ్ కెమెరా జతగా ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP Gekko GC16B3 కెమెరా ఉంది. కెమెరా పనితీరును మెరుగుపరిచేందుకు NICE ఆల్గరిథమ్ 2.0ను ఉపయోగించారు. మూడు ఫిల్మ్ ప్రొఫైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
భారీ బ్యాటరీ:
ఐక్యూ నియో11 అల్ట్రాలో 9,100mAh బ్లూ ఓషన్ బ్యాటరీ ఉంది. ఇది iQOO నియో సిరీస్‌లో ఇప్పటివరకు అందించిన అతిపెద్ద బ్యాటరీ. నాలుగో తరం సిలికాన్ యానోడ్ టెక్నాలజీ, 886Wh/L ఎనర్జీ డెన్సిటీతో ఈ బ్యాటరీను రూపొందించారు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కంపెనీ పరీక్షల ప్రకారం ఒకసారి ఛార్జ్ చేస్తే 13.7 గంటల వరకు నిరంతర MOBA గేమింగ్, 23 గంటల వరకు షార్ట్-వీడియో స్ట్రీమింగ్ చేయవచ్చు. 9 గంటల రోజువారీ విద్యార్థి వినియోగాన్ని అనుకరించిన పరీక్షలో 56% బ్యాటరీ మిగిలినట్లు కంపెనీ తెలిపింది.
ఇతర ఫీచర్లు:
ఫోన్‌కు IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉన్నాయి. ఏవియేషన్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, హై-డ్యూరబిలిటీ రీన్ఫోర్స్డ్ గ్లాస్‌ను ఉపయోగించారు. నేషనల్ మిలిటరీ స్టాండర్డ్ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ పరీక్షలతో పాటు 1.2 మీటర్ల ఎత్తు నుంచి మార్బుల్ ఫ్లోర్‌పై డ్రాప్ టెస్టులను కూడా ఫోన్ తట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6.0తో పనిచేస్తుంది. 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Hi-Fi ఆడియో, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, BeiDou, GLONASS, Galileo, QZSS వంటి ఆప్షన్లు ఉన్నాయి.
ధర:
ఈ ఫోన్ చైనాలో అమ్మకాలకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే భారత్‌లో iQOO Neo11 Ultra విడుదల తేదీ, ధరపై కంపెనీ ఇంకా అధికారిక వివరాలను వెల్లడించలేదు. చైనాలో iQOO Neo11 Ultra ధరలు ఇలా ఉన్నాయి..
* 12GB + 256GB: 3,399 యువాన్లు (రూ.48,250).
* 16GB + 256GB: 3,799 యువాన్లు (రూ.53,925).
* 12GB + 512GB: 3,999 యువాన్లు (రూ.56,765).
* 16GB + 512GB: 4,399 యువాన్లు (రూ.62,440).
తాజావార్తలు
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
-
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
-
Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
-
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!