Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Global Birth Rates: సాధారణంగా ఒక ప్రాంతంలో ఆర్థిక పరిస్థితులు మెరుగై, జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు అక్కడ జననాల రేటు (Birth Rates) తగ్గడం చరిత్రలో చూశాం. కానీ, గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా 2007 నుంచి ప్రపంచమంతటా జననాల రేటు ఒకేలా పడిపోతూ వస్తోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోందని పరిశోధకులు తలలు బద్దలు కొట్టుకోగా, చివరకు ఓ ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. మన చేతిలో ఉండే ‘ఐఫోన్’ లేదా స్మార్ట్ఫోనే ఈ జననాల తగ్గుదలకు ముఖ్య కారణం కావచ్చని రెండు సరికొత్త పరిశోధనలు చెబుతున్నాయి.
నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ఏం చెప్పిందంటే..?
అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం… యూఎస్‌లో 1980 నుంచి 2007 వరకు ప్రతి వెయ్యి మంది మహిళలకు జననాల రేటు 65 నుంచి 70 మధ్య స్థిరంగా ఉండేది. కానీ 2007 తర్వాత ఇది వేగంగా పడిపోతూ వచ్చి, 2024 నాటికి 54కు చేరుకుంది. అంటే కేవలం 17 ఏళ్లలోనే 22 శాతం క్షీణత నమోదైంది. అయితే, జననాల రేటు తగ్గడానికి 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం వంటి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ఐఫోన్ ప్రభావం ఎంత ఉందనేదానిపై పరిశోధకులు ఒక వినూత్నమైన ప్రయోగం చేశారు. ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలో (2007 జూన్ నుంచి 2011 ఫిబ్రవరి వరకు) అమెరికాలో అది కేవలం ‘AT&T’ నెట్వర్క్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. దీనిని ఆధారంగా చేసుకుని, AT&T సిగ్నల్స్ పూర్తిగా ఉన్న ప్రాంతాలను, అసలు లేని ప్రాంతాలను పరిశోధకులు పోల్చి చూశారు. ఈ నెట్వర్క్ విస్తృతంగా ఉన్న కౌంటీలలో (ప్రాంతాలలో) 15-19 ఏళ్ల యువతుల్లో జననాలు 4.5 నుంచి 8 శాతానికి, 20-24 ఏళ్ల మహిళల్లో 3.2 నుంచి 6.6 శాతానికి తగ్గాయి. మొత్తంగా చూస్తే, 2007-2011 మధ్య కాలంలో 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో తగ్గిన జననాల రేటులో 33 నుంచి 52 శాతం వరకు క్షీణతకు కేవలం ఐఫోన్ యాక్సెస్ మాత్రమే కారణమని తేలింది.
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
2007 నుంచి 2024 మధ్య కాలంలో షాకింగ్..
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… నెట్వర్క్ లేని ప్రాంతాల్లో టీనేజ్ (15-19 ఏళ్లు) జననాలు 13.8 శాతం తగ్గితే, పాక్షికంగా ఉన్నచోట 18.9 శాతం, నెట్వర్క్ పూర్తిగా ఉన్నచోట ఏకంగా 26 శాతం తగ్గాయి. 2007 నుంచి 2024 మధ్య కాలంలో వయసు రీత్యా చూస్తే, 15-19 ఏళ్ల వారిలో జననాలు 70 శాతం, 20-24 ఏళ్ల వారిలో 47 శాతం తగ్గాయి. కానీ 35-39 ఏళ్ల వారిలో మాత్రం ఈ రేటు 14 శాతం పెరగడం గమనార్హం. అసలు ఐఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్ వల్ల పిల్లలు పుట్టే శాతం ఎలా తగ్గుతుందనే దానికి పరిశోధకులు కొన్ని బలమైన కారణాలను విశ్లేషించారు. స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత యువత బయట స్నేహితులతో ప్రత్యక్షంగా గడిపే సమయం దారుణంగా తగ్గిపోయింది. ఫలితంగా శృంగార కార్యకలాపాలు (Sexual Activity) క్షీణించాయి. అదే సమయంలో ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీ వినియోగం విపరీతంగా పెరిగింది. పరిశోధన కాలంలో గూగుల్‌లో ‘పోర్న్’ అనే పదం కోసం వెతకడం రెట్టింపు అవ్వడమే కాకుండా, ఎక్స్-రేటెడ్ సినిమాలు చూసే వారి సంఖ్య సైతం అన్ని వయసుల వారిలో పెరిగింది. దీనిని సెక్స్‌కు ప్రత్యామ్నాయంగా మార్చుకోవడం ఒక కారణమైతే, స్మార్ట్ఫోన్ల వల్ల గర్భధారణను నివారించే పద్ధతులు, కాంట్రాసెప్షన్, అబార్షన్ల వంటి సమాచారం యువతకు సులభంగా అందుబాటులోకి రావడం మరో కారణంగా కనిపిస్తోంది.
ఈ ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి ఆర్థికవేత్తలు వరల్డ్ బ్యాంక్ డేటాను ఉపయోగించి 128 దేశాల్లోని స్మార్ట్‌ఫోన్ విస్తరణను, టీనేజ్ జననాల రేట్లను పరిశీలించారు. విభిన్న ఆరోగ్య వ్యవస్థలు, మత సంప్రదాయాలు, చట్టాలు ఉన్న ఇరాన్, కోస్టారికా, గ్వాటెమాలా, చిలీ, మెక్సికో, టర్కీ వంటి దేశాల్లో సైతం స్మార్ట్ఫోన్ల వాడకం పెరిగిన తర్వాతే టీనేజ్ జననాల రేటు వేగంగా పడిపోయింది. దీనిని పరిశోధకులు “కామన్ గ్లోబల్ టెక్నాలజీ షాక్” (ప్రపంచవ్యాప్త సాంకేతిక ప్రకంపన) గా అభివర్ణించారు. ఈ డిజిటల్ యుగంలో మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఎంతలా తగ్గాయంటే… 2003లో రోజుకు సగటున 68 నిమిషాలు ఉన్న ఇన్-పర్సన్ సోషలైజింగ్ (ప్రత్యక్షంగా కలవడం, మాట్లాడుకోవడం) సమయం 2019 నాటికి 38 నిమిషాలకు పడిపోయింది (44 శాతం తగ్గుదల). అదే సమయంలో కంప్యూటర్లు, స్క్రీన్ల ముందు గడిపే సమయం రోజుకు 22 నిమిషాల నుంచి 96 నిమిషాలకు (336 శాతం పెరుగుదల) పెరిగింది. జననాల రేటు తగ్గడానికి ఐఫోన్ ఒక్కటే కారణం కాకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కీలక పాత్ర పోషిస్తోందని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ధనిక దేశాలతో పాటు పేద దేశాల్లోనూ జనాభా తగ్గుముఖం పడుతోంది. కెనడా, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలు ఇప్పటికే తీవ్ర జనాభా క్షీణతను ఎదుర్కొంటున్నాయి. చైనా తన ‘వన్ చైల్డ్ పాలసీ’ని ముగించినా ఫలితం లేకపోయింది. జపాన్, సౌత్ కొరియాలు జనాభాను పెంచేందుకు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా ఆశించిన మార్పు రావడం లేదు. ఆఫ్రికాలోని కొన్ని పేద దేశాల్లో జననాల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారతదేశం, బ్రెజిల్ వంటి మధ్య ఆదాయ దేశాల్లో సైతం ఇప్పుడు జననాల రేటు చాలా వేగంగా పడిపోతోంది. మన చేతిలోని చిన్న స్మార్ట్‌ఫోన్, ప్రపంచ జనాభా స్వరూపాన్నే మార్చేస్తోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు