Site icon NTV Telugu

iPhone 17 సిరీస్‌ లాంటి లుక్.. రూ.9 వేలకే సొంతం చేసుకోవచ్చు..

Tecno Spark Go 3

Tecno Spark Go 3

ఐఫోన్‌ కొనాలి అని చాలా మందికి డ్రీమ్‌ ఉంటుంది.. అయితే, కొత్తగా వచ్చే ఐఫోన్‌ సిరీస్‌ ధరలు బడ్జెట్‌లో ఉండకపోవడంతో.. చాలా మంది వెనుకడుగు వేస్తారు.. అయితే, ఐఫోన్‌ 19 సిరీస్‌ ఫోన్‌ లాంటి లుక్‌లో ఉన్న ఓ బడ్జెట్‌ ఫోన్‌.. ఇప్పుడు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది.. టెక్నో తాజాగా Tecno Spark Go 3 అనే ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ నెలాఖరులో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపించినా, వాస్తవంగా ఇది సింగిల్ రియర్ కెమెరాతోనే వస్తుంది.

ధర వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ఒకే వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది.. ఈ ఫోన్ అమ్మకాలు జనవరి 23 నుంచి అమెజాన్‌లో ప్రారంభమవుతాయి. ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చు. తరువాత దశలో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
టైటానియం గ్రే, ఇంక్ బ్లాక్, గెలాక్సీ బ్లూ, అరోరా పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 6.74 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ను అందించడం ఈ ధరలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్‌కు Unisoc T7250 ప్రాసెసర్ శక్తినిస్తోంది. అలాగే IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ స్పాష్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది 4G స్మార్ట్‌ఫోన్ మాత్రమేనని గమనించాలి. కెమెరా సెక్షన్‌లో 13MP ప్రైమరీ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో పాటు 15W ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. టెక్నో యొక్క Ella వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

ఈ ఫోన్ కొనాలా?
స్టైలిష్ డిజైన్, పెద్ద డిస్‌ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ ఓ బడ్జెట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. అయితే ఇదే ధర పరిధిలో Redmi, Lava, Samsung వంటి బ్రాండ్ల నుంచి 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు 2026లో కొత్త ఫోన్ కొనాలనుకుంటే, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 5G ఫోన్‌నే ఎంపిక చేసుకోవడం మంచిది. డిజైన్‌కు ప్రాధాన్యం ఇస్తే టెక్నో స్పార్క్ గో 3, టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తే 5G ఫోన్ మీకు సరైన ఎంపిక అవుతుంది.

Exit mobile version