Site icon NTV Telugu

IPhone 17 Sereis: ఐఫోన్స్ లో ఇకపై ఫిజికల్ సిమ్ స్లాట్‌కు ఎండ్ కార్డ్ పడనుందా?

Iphone 17

Iphone 17

IPhone 17 Sereis: ఆపిల్ సంస్థ “Awe Dropping” ఈవెంట్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించబోతోంది. ఈ వేడుకలోనే iPhone 17 సిరీస్ లాంచ్ చేయబోతోందని సమాచారం. దీనితో లాంచ్‌కు మరో 10 రోజులు మిగిలి ఉండగానే లీకులు వేగంగా బయటకు వస్తున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి iPhone 17 సిరీస్ మోడల్స్ అనేక అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తిగా eSIM-మాత్రమే (SIM-less)గా రావచ్చని చెబుతున్నాయి.

DPL 2025: నితీశ్ రాణా వన్ మ్యాన్ షో.. టైటిల్‌ విజేతగా వెస్ట్ ఢిల్లీ లయన్స్!

ఇప్పటికే అన్ని iPhone మోడల్స్ eSIM సపోర్ట్ కలిగి ఉన్నప్పటికీ, iPhone 14 నుంచి US మోడల్స్‌లోనే ఫిజికల్ సిమ్ ట్రే లేకుండా వస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఈ పరిమితి యూరప్ సహా మరిన్ని దేశాలకు విస్తరించబోతుందని తెలుస్తోంది. ఆపిల్ మొదటిసారి iPhone 14 సిరీస్ (2022)లో ఫిజికల్ సిమ్ స్లాట్‌ను అమెరికా మార్కెట్‌లో తొలగించింది. కానీ ఇతర దేశాల్లో ఇప్పటివరకు eSIM + ఫిజికల్ సిమ్ రెండూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారబోతోందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Crime News: మంత్రగాడి మాటలు నమ్మి మనవడిని బలి ఇచ్చిన తాత!

ఈ eSIM వల్ల ప్రయోజనాలు మాత్రమే కాకుండా సవాళ్లు కూడా ఉన్నాయి. ఇందులో ప్రయోజనాలు విషయానికి వస్తే.. సౌకర్యవంతమైన వినియోగం, అధిక భద్రత, తక్షణ డీయాక్టివేషన్ చేసుకోవచ్చు. మరోవైపు అన్ని ఫోన్లలో eSIM సపోర్ట్ లేకపోవడం, తరచూ ఫోన్లు మార్చుకునే వారికి ఇబ్బందులు కలగడం వల్ల సవాళ్లను ఎదురుకోవచ్చు.

Exit mobile version