అల్ట్రా-స్లిమ్ డిజైన్, కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6,500mAh బ్యాటరీభారత్‌కు రానున్న Infinix Note Edge..!

Infinix Note Edge

Infinix Note Edge

Infinix Note Edge: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ (Note) సిరీస్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ టిప్‌స్టర్ నుండి Infinix Note Edge పేరుతో పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదుగానీ.. కొన్ని కీలక ఫీచర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి. ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఒక అల్ట్రా-స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ తో రానుందని సమాచారం. డిజైన్ పరంగా ఇది మోటోరోలా ఎడ్జ్ 70 తరహాలో ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Magnus Carlsen: మరోసారి భారత గ్రాండ్‌మాస్టర్ చేతిలో ఓడిన మాగ్నస్ కార్ల్సెన్.. ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేక..?

×
×
Ad

ఫోన్ వెనుక భాగంలో టాప్ వైపు పెద్దగా ఉన్న కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. ఇందులో రెండు కెమెరా లెన్స్‌లు, LED ఫ్లాష్, అదనపు ఫిల్లర్ లైట్ ఉండే అవకాశం ఉంది. డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్ ను అందిస్తుందని టిప్‌స్టర్ వెల్లడించారు. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ ఫోన్ లో MediaTek Dimensity 7100 SoC ఉండే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 6nm ప్రాసెస్ టెక్నాలజీపై ఆధారపడి తయారవుతుందని సమాచారం. ఇది మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మంచి పనితీరును అందించగలదని అంచనా.

అదిరిపోయే ఫీచర్స్ తో కేవలం రూ.12,499లకే Foxsky 43 అంగుళాల Full HD Smart LED TV.. ఎక్కడ కొనాలంటే..?

ఈ ఫోన్‌లో భారీగా 6,500mAh బ్యాటరీ ఇవ్వనున్నారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఆండ్రాయిడ్ 16తో బాక్స్ నుంచే రానుంది. అలాగే, కంపెనీ 3 సంవత్సరాల OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు అందించే అవకాశం ఉందని సమాచారం. ఈ మొబైల్ భారత్‌లో 2026 జనవరిలో లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. టీజర్ పోస్టర్‌లో ఫోన్ గ్రీన్ కలర్ వేరియంట్లో కనిపించింది. ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20,000లోపే ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.