Chat GPT & Deep Seek:ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం సంచలన ఆదేశాలు
- Chat GPT, Deep Seek వంటి యాప్ లు ఉపయోగించొద్దన్న కేంద్రం
- డేటా గోప్యత, సమాచార భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పనుల్లో Chat GPT, Deep Seek వంటి ప్రజాదరణ పొందిన AI టూల్స్‌ను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయమై ఒక కీలక అడ్వైజరీ విడుదల చేసింది. ప్రభుత్వానికి చెందిన అధికారిక పరికరాలు, సిస్టమ్స్‌పై ఈ AI టూల్స్ వినియోగాన్ని పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది.
ఈ నిర్ణయం ప్రధానంగా ప్రభుత్వ డేటా గోప్యత (డేటా ప్రైవసీ), సమాచార భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నియంత్రణలేమి లేకుండా AI టూల్స్‌లో సున్నితమైన, వ్యక్తిగత లేదా రహస్య సమాచారాన్ని నమోదు చేయడం వల్ల ప్రభుత్వ డేటా భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా దేశానికి సంబంధించిన రహస్య సమాచారం ఇతర దేశాలకు లేదా అనధికార సంస్థలకు చేరే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
Also Read
- Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
- OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
- Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లేతో కొత్త 5G ఫోన్
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
ప్రభుత్వ శాఖలు మరియు ఉద్యోగులు అధికారిక విధులు నిర్వహించేటప్పుడు AI సేవలను అత్యంత జాగ్రత్తగా, నియమావళి ప్రకారం మరియు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉపయోగించాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ సమాచారాన్ని మరింత సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని కూడా కేంద్రం గుర్తు చేసింది.
ఇదే సమయంలో సైబర్ నిపుణులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ సమాచారం వంటి సున్నితమైన డేటాను AI టూల్స్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్‌లోడ్ చేయకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా డేటా దుర్వినియోగం, సైబర్ ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!