NTV Telugu Site icon

Safety Tips: గీజర్‌ను సరిగ్గా వాడకపోతే ప్రాణానికే ప్రమాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?

Geyser

Geyser

గీజర్ పేలి నవ వధువు మరణించిన ఘటన యూపీలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. ఐదు రోజుల క్రితమే పెళ్లి కాగా.. అత్తగారింటికి వచ్చిన యువతి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. దీంతో.. స్నానం చేసే క్రమంలో గీజర్ పేలి ఆ మహిళ మృతి చెందింది. అయితే.. గీజర్‌ను ఎక్కువగా చలికాలం వాడుతుంటారు. ఈ క్రమంలో వేడి నీళ్లతో స్నానానికి గీజర్ల వాడకం బాగా పెరిగింది. కాగా.. గీజర్‌ను ఉపయోగించే క్రమంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదకరంగా మారుతుంది. ఈ క్రమంలో.. గీజర్‌ని ఉపయోగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. గీజర్ వేడెక్కడం, పవర్ ప్రాబ్లం, గీజర్‌పై అధిక లోడ్ వల్ల.. గీజర్ ప్రమాదకరంగా మారనుంది. అలాంటప్పుడు గీజర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని భద్రతా చిట్కాలను అనుసరించడం చాలా ముఖ్యం.

Dulquer Salmaan : అరుదైన ఘనత సాధించిన ‘లక్కీ భాస్కర్’

గీజర్‌ను బాత్రూంలో అమర్చడానికి సాంకేతిక నిపుణుడి సహాయం తీసుకోవాలి. ఎందుకంటే గీజర్‌ను తప్పుగా ఇన్‌స్టాల్ చేయడం వల్ల గ్యాస్ లీక్‌లు లేదా ఇతర సంబంధిత సమస్యలు వస్తాయి. దీంతో.. ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అలాగే.. సురక్షితమైన, సరైన స్థలంలో గీజర్‌ను పెట్టుకోవాలి. బాత్‌రూంలోని పై భాగంలో ఫిట్టింగ్ చేయించుకోవాలి. తక్కువ ఎత్తులో అమరిస్తే స్నానం చేసేటప్పుడు నీళ్లు ఆ గీజర్‌పై పడి పాడయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. గీజర్‌కు చేతులు తగిలినా ఊహించని ప్రమాదాలు జరగొచ్చు. అలాగే.. క్వాలిటీ ఉన్న గీజర్లనే వాడాలి.. క్వాలిటీ లేదంటే అవి పేలే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి, సర్టిఫైడ్ కంపెనీ నుంచే గీజర్‌లను కొనాలి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో రెండో హిందూ పూజారి అరెస్ట్..

గీజర్ వేడెక్కకుండా నిరోధించడానికి, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి థర్మోస్టాట్‌ను 50°C, 60°C మధ్య ఉంచండి. ఎందుకంటే.. గీజర్ అధిక ఉష్ణోగ్రత తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతుంది. గీజర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు విద్యుత్ భద్రతను గుర్తుంచుకోండి. షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ షాక్‌ను నివారించడానికి సరైన ఎర్తింగ్‌తో కూడిన పవర్ అవుట్‌లెట్‌ను ఉపయోగించండి. గీజర్‌ని రోజంతా ఆన్‌లో ఉంచవద్దు.. ఉపయోగంలో ఉన్నప్పుడు మాత్రమే గీజర్‌ను ఆన్‌లో ఉంచండి. ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచితే గీజర్ వేడెక్కి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. స్నానం పూర్తయిన వెంటనే స్విచ్ఛాఫ్ చేయకపోతే అనవసర ప్రమాదాలకు దారి తీసే అవకాశముంది.

Show comments