Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor X8e 4G Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హానర్ (Honor) కంపెనీ X సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Honor X8e 4G పేరుతో పరిచయం చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108MP ప్రైమరీ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, భారీ 7,700mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఫోన్‌కు దుమ్ము, నీటి నుంచి రక్షణ కల్పించే రేటింగ్స్ కూడా ఉన్నట్లు కంపెనీ వివరాల్లో పేర్కొన్నారు. ఈ ఫోన్ ధర ఎంత? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Honor X8e 4G స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. అజర్బైజాన్లో దీని ధర AZN 688 నుంచి AZN 820 వరకు ఉంది. భారత కరెన్సీలో సుమారు రూ.35,000 నుంచి రూ.42,000 వరకు అవుతుంది. అయితే, ఇవి కేవలం కరెన్సీ మార్పిడి ఆధారంగా లెక్కించిన అంచనా ధరలు మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్ Sunrise Orange, Desert Gold, Velvet Black రంగుల్లో కనిపించింది.
Also Read
- Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
- 6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
- Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
- iQOO Neo 12: 9000mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లేతో.. iQOO Neo 12 పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లాంచ్!
ఈ ఫోన్లో 6.87 అంగుళాల TFT LCD డిస్ప్లే ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గరిష్ఠ బ్రైట్నెస్ 1,020 నిట్స్ వరకు ఉంటుంది. ఫోన్లో Qualcomm Snapdragon 685 ప్రాసెసర్‌తో పాటు Adreno 610 GPU ఉన్నాయి.
Honor X8e 4Gలో 108MP ప్రైమరీ రియర్ కెమెరా అందించారు. ఈ కెమెరాకు f/1.75 అపర్చర్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో మరో కెమెరా లెన్స్ కూడా అందించారు. కెమెరాతో 1080p రిజల్యూషన్‌లో వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే 8x డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరాను అందించారు. ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణగా 7,700mAh బ్యాటరీ. ఫోన్లో 45W Honor SuperCharge వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. Honor X8e 4Gలో AI Image to Video 2.0 ఫీచర్ అందించారు. దీనితో పాటు AI టూల్స్‌ను త్వరగా యాక్సెస్ చేసేందుకు ప్రత్యేక AI బటన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు IP68, IP69, IP69K రేటింగ్‌లు ఉంది.
తాజావార్తలు
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
-
NEET UG: నీట్-యూజీ వివాదం ఎఫెక్ట్.. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ ఫోకస్..
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!