Honor X80: హానర్ సంస్థ తన X-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ Honor X80పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలో త్వరలోనే ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు టాక్. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ధర, కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. ముఖ్యంగా, ఈ ఫోన్‌లో భారీ 10,000mAh బ్యాటరీ ఉండనున్నట్లు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, Honor X80 ధర సుమారు CNY 1,000 (భారత కరెన్సీలో దాదాపు రూ.13,000)గా ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో ఇంత పెద్ద బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ వస్తుండటం మార్కెట్‌లో 2026 చివరి నాటికి విడుదల అయ్యే అవకాశం ఉంది.
Read Also: Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు..
Honor X80 కీలక స్పెసిఫికేషన్లు..
* బ్యాటరీ: భారీ 10,000mAh
* డిస్‌ప్లే: 6.81 అంగుళాల LTPS స్క్రీన్
* రిజల్యూషన్: 1.5K
* ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్
* Honor X70కి అప్‌గ్రేడ్‌గా Honor X80
అయితే, గతేడాది జూలై 2025లో చైనాలో విడుదలైన Honor X70కి సక్సెస్ ఫుల్ గా మార్కెట్‌లోకి రానుంది.
Honor X70 స్పెసిఫికేషన్లు
* 6.79 అంగుళాల 1.5K డిస్‌ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్
* స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్
* 12GB RAM, 512GB స్టోరేజ్
* 8,300mAh బ్యాటరీ
* 80W ఫాస్ట్ ఛార్జింగ్
* 50MP రియర్ కెమెరా
* 8MP ఫ్రంట్ కెమెరా
ఈ స్పెసిఫికేషన్లతో పోలిస్తే, Honor X80లో బ్యాటరీ సామర్థ్యం భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం Honor X80కు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే, బడ్జెట్ సెగ్మెంట్‌లో భారీ బ్యాటరీతో హానర్ కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది.