165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
- 165Hz రిఫ్రెష్ రేట్‌తో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్
- 12.1 అంగుళాల 3K IPS LCD పేపర్‌లైక్ డిస్ప్లే
- యాంటీ-గ్లేర్ మైక్రో-టెక్స్చర్డ్ కోటింగ్‌తో పేపర్‌పై రాస్తున్న అనుభూతి
- లో బ్లూ లైట్, యాంటీ-ఫ్లికర్ ఐ-కేర్ టెక్నాలజీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Pad 20 Pro Paperlike Edition: హానర్ (HONOR) నుండి మరో కొత్త టాబ్లెట్ మోడల్‌ను పరిచయం చేసింది. HONOR Pad 20 Pro పేపర్‌లైక్ ఎడిషన్ (HONOR Pad 20 Pro Paperlike Edition) పేరుతో తీసుకొచ్చిన ఈ టాబ్లెట్‌ను ముఖ్యంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, డిజిటల్ క్రియేటర్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ప్రత్యేకమైన పేపర్‌లైక్ యాంటీ-గ్లేర్ డిస్ప్లేతో పాటు పవర్ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, స్టైలస్ సపోర్ట్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు.
ఇందులో 12.1 అంగుళాల 3K IPS LCD డిస్ప్లే ఉంది. ఇది 3,000 × 1,872 పిక్సెల్స్ రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియో, 292 PPI పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. డిస్ప్లే గరిష్ఠంగా 165Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ టాబ్లెట్‌లోని ప్రధాన ప్రత్యేకత పేపర్‌లైక్ ఫినిష్. యాంటీ-గ్లేర్ మైక్రో-టెక్స్చర్డ్ కోటింగ్‌ను ఉపయోగించడం వల్ల స్క్రీన్‌పై రిఫ్లెక్షన్స్ తగ్గుతాయి. స్టైలస్‌తో రాస్తున్నప్పుడు పేపర్‌పై పెన్‌తో రాసినట్లుగా సహజమైన టచ్, రెసిస్టెన్స్‌ను అందించేలా ఈ డిస్ప్లేను రూపొందించారు. అలాగే హార్డ్‌వేర్ స్థాయిలోనే లో బ్లూ లైట్, యాంటీ-ఫ్లికర్ వంటి పలు ఐ-కేర్ టెక్నాలజీలకు సర్టిఫికేషన్ పొందింది. ఎక్కువసేపు చదవడం, నోట్లు రాసుకోవడం, స్క్రీన్‌పై పనిచేసే వారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
Also Read
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
- రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
- Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
పనితీరు కోసం దీనికి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 4nm మొబైల్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 825 GPU ఉంది. ఈ హార్డ్‌వేర్ ద్వారా మల్టీటాస్కింగ్, క్రియేటివ్ వర్క్, AI ఆధారిత పనులు వంటి వాటిని సులభంగా నిర్వహించవచ్చు. టాబ్లెట్‌లో 8GB RAM, 256GB స్టోరేజ్ అందించారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 16 ఆధారిత MagicOS 10.0పై ఇది పనిచేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం టాబ్లెట్‌లో 10,100mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎక్కువసేపు రీడింగ్, వీడియోలు, మల్టీ-విండో వర్క్, నోట్-టేకింగ్ వంటి పనులు చేసేవారికి పెద్ద బ్యాటరీ ఉపయోగపడుతుంది. భారీ డిస్ప్లే ఉన్నప్పటికీ మెటల్ యూనీబాడీ డిజైన్‌తో టాబ్లెట్‌ను స్లిమ్‌గా రూపొందించారు. దీని మందం కేవలం 6.29mm, బరువు 537 గ్రాములుగా ఉంది.
ఈ కొత్త ఎడిషన్‌లో MagicOS ఆధారిత PC Mode అందించారు. ఇది డెస్క్‌టాప్ తరహా ఇంటర్ఫేస్ను అందిస్తూ ఒకేసారి పలు విండోలను నిర్వహించడానికి, ఫైళ్లతో సులభంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. స్టైలస్‌తో నోట్-టేకింగ్, స్కెచింగ్ వంటి పనుల కోసం HONOR Magic-Pencil 4sకు సపోర్ట్ ఉంది. అలాగే టాబ్లెట్‌తో ఉపయోగించేందుకు ప్రత్యేకమైన మాగ్నెటిక్ కీబోర్డ్ కేస్‌ను కూడా అందించారు. కెమెరా విభాగంలో వెనుకవైపు 13MP కెమెరాను f/2.0 అపెర్చర్‌తో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. ఆడియో కోసం టాబ్లెట్‌లో ఆరు స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. DTS అల్ట్రా సౌండ్, హానర్ స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా లభిస్తుంది. దీంతో సినిమాలు, సంగీతం, వీడియో కంటెంట్‌ను మెరుగైన ఆడియో అనుభూతితో ఆస్వాదించవచ్చు.
కనెక్టివిటీ కోసం వై-ఫై 7, బ్లూటూత్ 6.0, USB టైప్-C విత్ OTG సపోర్ట్ ఉన్నాయి. Wi-Fi 7 ద్వారా వేగవంతమైన వైర్లెస్ కనెక్టివిటీని అందించేందుకు టాబ్లెట్ సిద్ధంగా ఉంది. ఈ టాబ్లెట్ పరిమాణం 277.07 × 179.28 × 6.29mmగా ఉంది. ఇది ప్రస్తుతం గ్రే కలర్లో అందుబాటులోకి వచ్చింది. ధర, వివిధ మార్కెట్లలో లభ్యత వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ధర, సేల్ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
-
Star Batter: ఆ ప్లేయర్‌కు ఏమైంది..? అకస్మాత్తుగా ఆట మధ్యలో వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్..
-
Naagin: ‘నాగిన్’ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ఇక థియేటర్లలో నాగరాణుల మహామేళా.. శ్రీదేవి రికార్డు బద్దలవుతుందా?
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
ట్రెండింగ్
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!