NTV Telugu Site icon

Honor Magic 6 Pro: మరో కొత్త ఫోన్ విడుదల చేసిన హానర్..ఫోన్లోనే ఫొటోగ్రఫీ!

Honor Magic6 Pro

Honor Magic6 Pro

హానర్ మరో కొత్త ఫోన్ ని విడుదల చేసింది. అదే హానర్ మ్యాజిక్ 6 ప్రో. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. గత జనవరిలో చైనాలో ఆవిష్కరించిన హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్‌ను ఫిబ్రవరిలో సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, హానర్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలోనూ ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో కంపెనీ కెమెరా సిస్టమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

READ MORE: Ponguleti Srinivasa Reddy: ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి

ఈ ఫోన్ ఏఐ పవర్డ్ నెక్స్ట్ జనరేషన్ ఫాల్కన్ కెమెరా సిస్టమ్‌తో అందించబడింది. హానర్ మ్యాజిక్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ ను 12GB + 512GB సింగల్ వేరియంట్ లో రూ. 89,999 ధరతో ఇండియా లో విడుదల చేసింది. ఈ ఫోన్ అమెజాన్, ప్రధాన రిటైల్ స్టోర్స్, హానర్ ఇండియా అధికారిక వెబ్సైట్ నుంచి ఆగస్టు 15వ తేదీ నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది.

READ MORE:Ponguleti Srinivasa Reddy: ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి

ఈ ఫోన్ హానర్ యొక్క Magic OS 8.0 OS పై నడుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఏఐ ఆధారిత అధునాతన మోషన్ సెన్సింగ్ టెక్నాలజీని అందించిన ఈ ఫోన్‌లో స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ కూడా చేయవచ్చు. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన లెన్స్ 50 మెగాపిక్సెల్స్, ఇందులో సూపర్ డైనమిక్ ఫాల్కన్ కెమెరా H9000 HDR సెన్సార్ ఉంది. 1080p వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో 80వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది.

READ MORE:CM Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ.. ఎంతో సంతృప్తిని ఇచ్చింది..

ఈ ఫోన్ లో ఉన్న టెలిఫోటో కెమెరా సుదూర వస్తువులను కూడా చక్కటిగా క్యాప్చర్ చేయగలదు. ఇది 180-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, మాక్రో కెమెరాను కలిగి ఉంది. ఈ హానర్‌ మ్యాజిక్‌ 6 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌తో పాటు 256జీబీ, 512 బీబీ, 1 బీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌తో తీసుకొచ్చారు. 80వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చేస్తోంది.

READ MORE: West Bengal : 14 గంటల విచారణ… ఆపై అరెస్ట్, రేషన్ పంపిణీ కుంభకోణంలో టీఎంసీ నేతపై ఈడీ యాక్షన్

ఈ ఫోన్ 2800 x1280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.8 అంగుళాల LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనికి 100% DCI-P3 కలర్ గామట్ సపోర్ట్ ఉంటుంది. ఇది 5000 నిట్‌ల గరిష్ట ప్రకాశ వంతంగా మెరుస్తుంది. డిస్ప్లేలో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కనిపిస్తుంది. అంతేకాకుండా, డాల్బీ విజన్‌కు మద్దతు కూడా డిస్ప్లేలో అందుబాటులో ఉంటుంది. ఈ పరికరంలో IP68 రేటింగ్ కూడా ఇవ్వబడింది. ఓవరాల్ గా మ్యాజిక్ 6 ప్రోలో డిస్ ప్లే, కెమెరా పరంగా కంపెనీ గొప్ప ఫీచర్లను అందించబోతోందని చెప్పొచ్చు.

READ MORE:Arijit Singh: బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కి ఏమైంది..? తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్

ఈఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
డిస్‌ప్లే: ఈఫోన్‌లో 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, అడాప్టివ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 5000 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఉంటుంది.
ప్రాసెసర్:ఈ డివైజ్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, అడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.
మెమొరీ: ఈ 12 జీబీ/16 జీబీ ర్యామ్, 256 జీబీ/512 జీబీ/1 టీబీ స్టోరేజీ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించారు.
కెమెరా: ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 180ఎంపి ఓఐఎస్ పెరిస్కోప్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 3డీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్: ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్‌పై పని చేస్తుంది.
బ్యాటరీ: ఇందులో 5600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ వైర్డ్ చార్జింగ్, 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Show comments