200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- మే 25న చైనాలో HONOR 600 సిరీస్ అధికారిక లాంచ్
- HONOR 600, HONOR 600 Pro ఫోన్లను విడుదల చేయనున్న హానర్
- 200MP ప్రధాన కెమెరా ఈ సిరీస్ ప్రధాన హైలైట్
- 6.57 అంగుళాల 1.5K OLED 120Hz డిస్ప్లే ఉండే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR 600 Series Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించేందుకు హానర్ (HONOR) సిద్ధమవుతోంది. ఈ మధ్యే మలేషియాలో గ్లోబల్ మార్కెట్ కోసం HONOR 600, HONOR 600 Pro స్మార్ట్ఫోన్లను పరిచయం చేసిన కంపెనీ.. ఈ నెల ప్రారంభంలో యూకేలో కూడా వాటిని విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌ను మే 25న చైనాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
HONOR 600 సిరీస్ ప్రత్యేకమైన ట్రిపుల్-కలర్ డిజైన్‌తో రానుంది. తొలిసారిగా డ్యూయల్ మ్యాగ్నెటిక్ క్లోజర్ ప్రాసెస్‌ను ఉపయోగించడం ఈ ఫోన్ల ప్రత్యేకతగా నిలుస్తోంది. డిజైన్, కలర్ స్కీమ్, ఫోన్ ఫినిషింగ్ పరంగా ఈ సిరీస్ కొత్త మార్పులను తీసుకువస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా “Lucky Star” అనే కొత్త ఫ్లాగ్షిప్ కలర్‌ను హానర్ ఇప్పటికే ప్రకటించింది. వీటికి తోడుగా అబ్సిడియన్ బ్లాక్, గ్రీన్ ఆపిల్, లైట్ ఫెదర్ బ్లూ రంగుల్లో కూడా ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. గ్లోబల్ వెర్షన్‌తో పోలిస్తే చైనా మోడళ్ల డిజైన్‌లో కొంత మార్పు కనిపించనుంది. స్టాండర్డ్ HONOR 600 మోడల్లో డ్యూయల్ కెమెరాలతో సింగిల్ కెమెరా బార్ ఉండగా, Pro మోడల్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వనున్నారు.
Also Read
- Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
- TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Motorola Edge 70 Plus: 200MP కెమెరా.. 6500mAh బ్యాటరీ! Motorola Edge 70 Plus ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
డిస్ప్లే విషయంలో రెండు ఫోన్లలో కూడా 6.57 అంగుళాల 1.5K OLED 120Hz స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. అలాగే 200MP ప్రధాన కెమెరా ఈ సిరీస్ హైలైట్‌గా నిలవనుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, HONOR 600లో Snapdragon 7 Gen 4 చిప్ కొనసాగనుందని సమాచారం. అయితే హానర్ 600 Proలో గ్లోబల్ వెర్షన్లో ఉన్న స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ స్థానంలో మీడియాటెక్ డిమెంసిటీ 8550 SoC ఇవ్వనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి.
బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్లు భారీ అప్‌గ్రేడ్‌తో రానున్నాయి. HONOR 600లో 8600mAh బ్యాటరీ ఉండొచ్చని, HONOR 600 Proలో 8000mAh బ్యాటరీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ మోడళ్లలో 7000mAh బ్యాటరీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో, చైనా వేరియంట్లలో పెద్ద బ్యాటరీలను అందించడం వినియోగదారులకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది.
తాజావార్తలు
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!