Site icon NTV Telugu

3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP69K/69/68/66 డ్యూరబిలిటీ రేటింగ్‌లతో లాంచ్‌కు సిద్ధమైన Honor 500 సిరీస్..!

Honor 500

Honor 500

Honor 500: Honor సంస్థ కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ Honor 500 ను ఈ నెల 24న చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో Honor 500, Honor 500 Pro మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఈ మొబైల్స్ సంబంధించి కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, అధికారికంగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఫోన్‌ల వెనుక భాగం డిజైన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్-స్టైల్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ బ్యాక్ డిజైన్ స్పష్టంగా వీటిలో కనిపిస్తున్నాయి.

Supreme Court: ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..

Honor 500 సిరీస్ ఈసారి భారీ స్పెసిఫికేషన్లతో రానుందని సమాచారం. సాధారణ Honor 500 మోడల్‌లో 6.55 అంగుళాల 1.5K 120Hz LTPS ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ లభించనుంది. దీనిలో Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను, కెమెరా విభాగంలో 200MP HP3 ప్రధాన సెన్సార్ (OIS‌తో), 12MP అల్ట్రావైడ్ మరియు 50MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. అలాగే 8000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితోపాటు IP69K/69/68/66 రేటింగ్‌లు, మెటల్ ఫ్రేమ్, Honor యొక్క C1+, E2 చిప్‌లు, MagicOS 10 లాంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. రూ. కోట్లల్లో సంపాదన..

ఇక Honor 500 Pro మోడల్‌ విషయానికి వస్తే.. ఇందులో Snapdragon 8 Elite చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారని సమాచారం. ఈ మొబైల్ కూడా 6.55-అంగుళాల 1.5K 120Hz OLED డిస్‌ప్లే ఉన్నా, కెమెరా విభాగంలో మాత్రం అప్‌గ్రేడ్‌లు కనిపిస్తున్నాయి. 200MP HP3 ప్రధాన సెన్సార్ (OIS‌తో), 12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో పాటు 50MP IMX856 టెలిఫోటో (3x జూమ్) కూడా ఉండనుంది. ఫ్రంట్ కెమెరా 50MP గానే ఉంటుంది. 8000mAh బ్యాటరీతో పాటు 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. అలాగే IP69K/69/68/66 రేటింగ్‌లు, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మెటల్ ఫ్రేమ్, C1+, E2 చిప్‌లు ఈ మోడల్‌ను మరింత ప్రీమియంగా నిలబెట్టనున్నాయి.

Exit mobile version