CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు ఉన్నాయని సీపీ సజ్జానార్ తెలిపారు.. రవిది విశాఖపట్నం.. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని చెప్పారు.. పాన్‌కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉందన్నారు. ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రవికి ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది.. ఫ్రాన్స్, దుబాయ్, థాయ్‌లాండ్ లాంటి ఎన్నో దేశాలు తిరిగాడన్నారు.. అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టినట్లు వెల్లడించారు.. టెలిగ్రామ్ యాప్‌లో కూడా పైరసీ సినిమా అప్‌లోడ్ చేశాడని తెలిపారు.. పైరసీ ముసుగులో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశాడని.. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
READ MORE: స్నేహితులు, సహోద్యోగులతో AI సంభాషణలు.. ChatGPTలో సరికొత్త ‘గ్రూప్ చాట్’ ఫీచర్..!
“రవి చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో చాలా మంది నష్టపోయారు.. రవి హార్డ్ డిస్కులో అన్ని సినిమాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు రవి రూ.20 కోట్లు సంపాదించాడు.. రవి నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.. 50 లక్షల మంది డేటా రవి దగ్గర ఉంది.. ఈ డేటాను మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంది.. దీని వెనుక పెద్ద రాకెట్ ఉంది.. సినిమా ఇండస్ట్రీకి పైరసీ వల్ల చాలా నష్టం జరిగింది.. పైరసీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది.. పైరసీ మాస్టర్ మైండ్, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశాం.. ఐబొమ్మపై చాలా రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం.. పైరసీని అరికట్టడానికి ఎంతో శ్రమించాం.. రవిపై ఐదు కేసులు నమోదు చేశాం” అని సీపీ సజ్జనార్ వెల్లడించారు.