HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMD Vibe 2 5G New Variant Launched: HMD గ్లోబల్ సంస్థ తన వైబ్ (Vibe) సిరీస్‌లో భాగంగా HMD Vibe 2 5G స్మార్ట్‌ఫోన్‌కు కొత్త 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో కంపెనీ ఈ ఫోన్‌ను 4GB + 64GB, 4GB + 128GB వేరియంట్లలో లాంచ్ చేయగా.. వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ రావడంతో ఇప్పుడు అధిక RAM కలిగిన కొత్త మోడల్‌ను మరోసారి లాంచ్ చేసింది.
కొత్త 6GB + 128GB వేరియంట్ జూన్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకలకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా.. ప్రారంభ ఆఫర్లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్లతో రూ.14,999 ప్రత్యేక ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. మరోవైపు 4GB + 128GB వేరియంట్ ప్రస్తుతం రూ.12,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 6.745 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన వీయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఇది Unisoc T8200 6nm ప్రాసెసర్ కలిగి ఉండగా.. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPUను జత చేశారు.
Also Read
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
స్టోరేజ్ పరంగా 64GB/128GB ఆప్షన్లు అందుబాటులో ఉండగా.. మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. రెండు సంవత్సరాల పాటు త్రైమాసిక సెక్యూరిటీ అప్డేట్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.

భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను అందించగా.. ఇందులో 3.5mm ఆడియో జాక్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. IP64 రేటింగ్‌తో వచ్చే ఈ ఫోన్ దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, USB Type-C వంటి ఫీచర్లను అందించారు. ఫోన్లో 6000mAh భారీ బ్యాటరీ ఉండగా.. కేవలం 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు లభిస్తుంది.
The wait is almost over. ⏳📱
Just 1 day to go until the HMD Vibe2 5G (6GB+128GB) arrives on Flipkart.
See you tomorrow at 12 PM. ⚡
For more details, check the link: https://t.co/gDhrclG08z#HMD #HMDIndia #HMDVibe2 #5GSmartphone #FlipkartLaunch
(HMD Vibe2 5G, HMD smartphone… pic.twitter.com/ZvpOrhQpvF
— HMD India (@HMDdevicesIN) June 15, 2026
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..