HackStop: సైబర్ దాడుల నుండి సమాజాన్ని కాపాడే ‘హ్యాక్ స్టాప్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో రోజు రోజుకు క్రైం రేటు పెరుగుతుంది.. ముఖ్యంగా సైబర్ క్రైమ్ ల సంఖ్య పెరుగుతూనే ఉంది.. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన కూడా ఈ నేరాలు తగ్గడం లేదు.. కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.. ఆన్ లైన్ లో మోసాలు జరుగుతున్నాయి.. ఈ నేరాలకు చెక్ పెట్టేందుకు ఇద్దరు మహిళా సైబర్ సెక్యూరిటీ నిపుణులు నడుం బిగించారు..సైబర్-సురక్షిత భారతదేశానికి భరోసా కల్పించే దిశగా కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను పటిష్టపరచడమే కాకుండా.. సైబర్ మోసాలను అరికట్టడమే లక్ష్యంగా అద్భుతమైన సైబర్ సెక్యూరిటీ ప్రోడక్ట్ ను జనాలకు పరిచయం చేశారు.. అదే “HackStop”.. పేరులోనే ఉంది.. హ్యాక్ చెయ్యడానికి వీలు కాదని…
ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఆన్లైన్ కార్యకలాపాల పెరుగుదల చాలా ఎక్కువైంది. కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ కు డిమాండ్ పెరిగింది.. పది రూపాయల టీ నుంచి వేసుకొనే చెప్పులు, ఇన్నెర్స్ వరకు అన్నిటిని కొనుగోలు చెయ్యడానికి యూపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు.. అందుకు తగ్గట్లుగానే సైబర్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. వ్యాపారాలు, వ్యక్తులు, ప్రభుత్వాలు కూడా సైబర్ దాడులపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నాయి. తక్షణ అవసరాన్ని గుర్తించి, సైబర్ సెక్యూరిటీ డొమైన్లోని ప్రముఖ నిపుణులు ప్రణతి, అనూష ఇద్దరూ “హాక్‌స్టాప్” అనే ఒక సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశారు.. సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా అడుగులు వేశారు..
Also Read
- Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- 7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
- ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
ఇకపోతే ఈ ‘హ్యాక్ స్టాప్’ అనేది కేవలం సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్, ఫైర్ వాల్ మాత్రమే కాదు. ఇది వ్యక్తులు, సంస్థలను సైబర్ దాడుల నుంచి సమర్థవంతంగా రక్షించుకోవడానికి రూపొందించబడిన సమగ్ర అవగాహన ఉత్పత్తి. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ల మిశ్రమం. సాంకేతిక నైపుణ్యంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండనుంది.. ఇది కేవలం సైబర్ దాడులు, మోసాల నుండి ప్రజలను రక్షించడమే కాకుండా, ఈ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడంతో పాటుగా ఆన్లైన్లో సురక్షితంగా ఉండటానికి సరైన సాధనాలను వారికి అందించే పరిష్కారాన్ని మేము రూపొందించాలనుకున్నాము. అని హ్యాక్ స్టాప్ ప్రణతి, అనూష లు తెలిపారు.
మన దేశాన్ని సైబర్ దాడులు, మోసాల నుండి కాపాడడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ సృష్టి “HackStop” అని చెప్పొచ్చు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు అనూష, ప్రణతి లు హ్యాక్‌స్టాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.. సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల నుండి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన విషయ పరిజ్ఞానం అందిస్తారు. ప్రజలు,పలు సంస్థలు ఈ సైబర్ దాడులను ఎదుర్కోడానికి సర్వ సన్నద్ధం చేయడమే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సాఫ్ట్ వేర్ గురించి జనాలకు వివరిస్తున్నారు.. అందుకోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు, ఆన్లైన్ ట్రైనింగ్ మాడ్యూల్స్, రియల్ లైఫ్ సిములేషన్స్ ద్వారా HackStop వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నారు…
అదే విధంగా డిజిటల్ గా కావాల్సిన రక్షణను ఇవ్వడమే కాకుండా.. సైబర్-దాడుల పట్ల అప్రమత్తంగా ఉంచుతుంది.. ఎలాంటి సైబర్ దాడిని అయినా ఎదుర్కోవచ్చు. సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ను తీసుకుని రావడానికి అనూష, ప్రణతిలు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. సమాజం మొత్తాన్ని సైబర్ దాడుల నుండి కాపాడడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.ఈ సైబర్‌సెక్యూరిటీ ‘హ్యాక్ స్టాప్’ ను ఆగస్టు 15న ఆవిష్కరించనుంది.ఈ ఇద్దరు చేస్తున్న ప్రయత్నం #CyberSafeIndia ని ప్రోత్సహించే లక్ష్యంతో.. సైబర్ దాడులను, మోసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వ్యక్తులను సిద్ధం చేస్తుంది. ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్, అత్యాధునిక సాంకేతికత ద్వారా HackStop ముందుండి నడిపిస్తుంది. సైబర్ సంరక్షకులుగా మారి, దేశ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను పటిష్టం చేయనుంది..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!