Site icon NTV Telugu

Google Pixel 10 Pro Fold vs Samsung Galaxy Z Fold 7: రెగ్యులర్ ఫోన్ బోర్ కొట్టిందా? అయితే ఫోల్డబుల్ ఫోన్ ట్రై చేయండి.. మరి ఏ మొబైల్ కొనాలంటే?

Mobile Comparison

Mobile Comparison

Google Pixel 10 Pro Fold vs Samsung Galaxy Z Fold 7: ఈ మధ్యకాలంలో అనేక మొబైల్ కంపెనీలు వినియోగదారులకు అనుగుణంగా ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తూ హల్చల్ చేస్తున్నాయి. దీనితో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా గూగుల్ తన Pixel 10 Pro Fold ను భారత మార్కెట్లో విడుదల చేయగా, శాంసంగ్ కూడా తన Galaxy Z Fold 7 ను కొద్ది రోజుల క్రితమే లాంచ్ చేసింది. రెండు ఫోన్లు కూడా ప్రీమియం సెగ్మెంట్‌లో లభిస్తున్నాయి. మరి ఈ రెండు ఫోన్లు ధర, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వంటి ఫీచర్లలో ఈ రెండు మోడల్స్ మధ్య ఉన్న తేడాలను ఒకసారి చూద్దాం.

ధరలు:
గూగుల్ Pixel 10 Pro Fold 16GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,72,999 ఉండగా.. శాంసంగ్ Galaxy Z Fold 7 12GB + 256GB మోడల్ రూ.1,74,999 కాగా, 12GB + 512GB మోడల్ రూ.1,86,999, 16GB + 1TB మోడల్ రూ.2,10,999గా ఉన్నాయి.

డిస్‌ప్లే:
గూగుల్ Pixel 10 Pro Fold 6.4 అంగుళాల OLED కవర్ స్క్రీన్‌తో వస్తుంది. ఇది 1080×2364 రెసల్యూషన్, 60–120Hz రిఫ్రెష్ రేట్, 3000 nits బ్రైట్నెస్, HDR సపోర్ట్ కలిగి ఉంది. ప్రధాన స్క్రీన్ 8 అంగుళాల OLED డిస్‌ప్లే (2076×2152, 120Hz, 3000 nits). మరోవైపు Galaxy Z Fold 7 లో 8 అంగుళాల QXGA+ Dynamic AMOLED 2X Flex డిస్‌ప్లే (1856×2160, 2600 nits), 6.5 అంగుళాల Full HD+ కవర్ డిస్‌ప్లే (1080×2520, 422ppi) కలిగి ఉంది.

Motorola Edge 60 Fusion vs Vivo T4 Pro 5G vs Realme P4 Pro 5G: మిడ్ రేంజ్ మొబైల్ కొనబోతున్నారా? మరి ఏ మొబైల్ బెస్ట్!

ప్రాసెసర్:
శాంసంగ్ Galaxy Z Fold 7 లో Snapdragon 8 Elite Octa-core ప్రాసెసర్ అందించారు. మరోవైపు గూగుల్ Pixel 10 Pro Fold లో Google Tensor G5 (3nm) ప్రాసెసర్, Titan M2 సెక్యూరిటీ చిప్ ఉంటుంది.

స్టోరేజ్, ర్యామ్:
Pixel 10 Pro Fold మొబైల్ లో 16GB RAM, 256GB స్టోరేజ్ మాత్రమే ఉండగా.. శాంసంగ్ Galaxy Z Fold 7 లో 12GB/16GB RAM, 256GB/512GB/1TB వంటి వేరువేరు స్టోరేజ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

కెమెరా:
Pixel 10 Pro Fold రియర్ కెమెరా సెటప్‌లో 48MP ప్రైమరీ, 10.5MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ కెమెరాలుగా రెండు 10MP సెన్సార్లు అందించారు. ఇక శాంసంగ్ Galaxy Z Fold 7 మొబైల్ లో వెనుక భాగంలో 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 10MP 3x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో రెండు 10MP కెమెరాలు లభ్యం కానున్నాయి.

టెన్సర్ G5 చిప్, ట్రిపుల్ కెమెరాతో Google Pixel 10, Pixel 10 Pro, and Pixel 10 Pro XL లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇలా!

బ్యాటరీ:
శాంసంగ్ Galaxy Z Fold 7 లో 4,400mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుండగా.. గూగుల్ Pixel 10 Pro Fold లో 5,015mAh బ్యాటరీ, 30W వైర్డ్ ఛార్జింగ్, 15W Qi2 వైర్లెస్ సపోర్ట్ అందిస్తున్నారు.

కనెక్టివిటీ:
శాంసంగ్ Galaxy Z Fold 7 లో 5G, 4G LTE, Wi-Fi 7, Bluetooth 5.4, NFC ఉండగా.. గూగుల్ Pixel 10 Pro Fold లో కూడా దాదాపు ఏవ్ 5G, Wi-Fi 7, Bluetooth v6, NFC, GPS, USB Type-C 3.2 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

మొత్తంగా గూగుల్ Pixel 10 Pro Fold ఎక్కువ ర్యామ్, Titan M2 సెక్యూరిటీ, శక్తివంతమైన డిస్‌ప్లే బ్రైట్నెస్, పెద్ద బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. మరోవైపు Galaxy Z Fold 7 అయితే 200MP కెమెరా, స్టోరేజ్ ఆప్షన్స్, Snapdragon ప్రాసెసర్, డ్యూరబుల్ డిజైన్‌తో ముందంజలో ఉంటుంది. కాబట్టి కెమెరా ప్రాధాన్యం ఉన్నవారు Samsung Galaxy Z Fold 7 ఎంచుకోవచ్చు. కానీ పనితీరు ఇంకా బ్యాటరీ బ్యాకప్ కోరుకునేవారికి Google Pixel 10 Pro Fold సరైన ఎంపిక అవుతుంది.

Exit mobile version