Google Pixel 10 Pro Fold vs Samsung Galaxy Z Fold 7: రెగ్యులర్ ఫోన్ బోర్ కొట్టిందా? అయితే ఫోల్డబుల్ ఫోన్ ట్రై చేయండి.. మరి ఏ మొబైల్ కొనాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Pixel 10 Pro Fold vs Samsung Galaxy Z Fold 7: ఈ మధ్యకాలంలో అనేక మొబైల్ కంపెనీలు వినియోగదారులకు అనుగుణంగా ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేస్తూ హల్చల్ చేస్తున్నాయి. దీనితో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ల పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా గూగుల్ తన Pixel 10 Pro Fold ను భారత మార్కెట్లో విడుదల చేయగా, శాంసంగ్ కూడా తన Galaxy Z Fold 7 ను కొద్ది రోజుల క్రితమే లాంచ్ చేసింది. రెండు ఫోన్లు కూడా ప్రీమియం సెగ్మెంట్‌లో లభిస్తున్నాయి. మరి ఈ రెండు ఫోన్లు ధర, డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వంటి ఫీచర్లలో ఈ రెండు మోడల్స్ మధ్య ఉన్న తేడాలను ఒకసారి చూద్దాం.
ధరలు:
గూగుల్ Pixel 10 Pro Fold 16GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,72,999 ఉండగా.. శాంసంగ్ Galaxy Z Fold 7 12GB + 256GB మోడల్ రూ.1,74,999 కాగా, 12GB + 512GB మోడల్ రూ.1,86,999, 16GB + 1TB మోడల్ రూ.2,10,999గా ఉన్నాయి.
Also Read
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
డిస్‌ప్లే:
గూగుల్ Pixel 10 Pro Fold 6.4 అంగుళాల OLED కవర్ స్క్రీన్‌తో వస్తుంది. ఇది 1080×2364 రెసల్యూషన్, 60–120Hz రిఫ్రెష్ రేట్, 3000 nits బ్రైట్నెస్, HDR సపోర్ట్ కలిగి ఉంది. ప్రధాన స్క్రీన్ 8 అంగుళాల OLED డిస్‌ప్లే (2076×2152, 120Hz, 3000 nits). మరోవైపు Galaxy Z Fold 7 లో 8 అంగుళాల QXGA+ Dynamic AMOLED 2X Flex డిస్‌ప్లే (1856×2160, 2600 nits), 6.5 అంగుళాల Full HD+ కవర్ డిస్‌ప్లే (1080×2520, 422ppi) కలిగి ఉంది.

ప్రాసెసర్:
శాంసంగ్ Galaxy Z Fold 7 లో Snapdragon 8 Elite Octa-core ప్రాసెసర్ అందించారు. మరోవైపు గూగుల్ Pixel 10 Pro Fold లో Google Tensor G5 (3nm) ప్రాసెసర్, Titan M2 సెక్యూరిటీ చిప్ ఉంటుంది.
స్టోరేజ్, ర్యామ్:
Pixel 10 Pro Fold మొబైల్ లో 16GB RAM, 256GB స్టోరేజ్ మాత్రమే ఉండగా.. శాంసంగ్ Galaxy Z Fold 7 లో 12GB/16GB RAM, 256GB/512GB/1TB వంటి వేరువేరు స్టోరేజ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
కెమెరా:
Pixel 10 Pro Fold రియర్ కెమెరా సెటప్‌లో 48MP ప్రైమరీ, 10.5MP అల్ట్రావైడ్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ కెమెరాలుగా రెండు 10MP సెన్సార్లు అందించారు. ఇక శాంసంగ్ Galaxy Z Fold 7 మొబైల్ లో వెనుక భాగంలో 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 10MP 3x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో రెండు 10MP కెమెరాలు లభ్యం కానున్నాయి.

బ్యాటరీ:
శాంసంగ్ Galaxy Z Fold 7 లో 4,400mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుండగా.. గూగుల్ Pixel 10 Pro Fold లో 5,015mAh బ్యాటరీ, 30W వైర్డ్ ఛార్జింగ్, 15W Qi2 వైర్లెస్ సపోర్ట్ అందిస్తున్నారు.
కనెక్టివిటీ:
శాంసంగ్ Galaxy Z Fold 7 లో 5G, 4G LTE, Wi-Fi 7, Bluetooth 5.4, NFC ఉండగా.. గూగుల్ Pixel 10 Pro Fold లో కూడా దాదాపు ఏవ్ 5G, Wi-Fi 7, Bluetooth v6, NFC, GPS, USB Type-C 3.2 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
మొత్తంగా గూగుల్ Pixel 10 Pro Fold ఎక్కువ ర్యామ్, Titan M2 సెక్యూరిటీ, శక్తివంతమైన డిస్‌ప్లే బ్రైట్నెస్, పెద్ద బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. మరోవైపు Galaxy Z Fold 7 అయితే 200MP కెమెరా, స్టోరేజ్ ఆప్షన్స్, Snapdragon ప్రాసెసర్, డ్యూరబుల్ డిజైన్‌తో ముందంజలో ఉంటుంది. కాబట్టి కెమెరా ప్రాధాన్యం ఉన్నవారు Samsung Galaxy Z Fold 7 ఎంచుకోవచ్చు. కానీ పనితీరు ఇంకా బ్యాటరీ బ్యాకప్ కోరుకునేవారికి Google Pixel 10 Pro Fold సరైన ఎంపిక అవుతుంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!