Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google: జీమెయిల్ పాస్వర్డ్ మరిచిపోవడం, సరిగ్గా అదే సమయంలో రికవరీకి ఇచ్చిన ఫోన్ నంబర్ లేదా ప్రత్యామ్నాయ ఈమెయిల్ అందుబాటులో లేకపోవడం ఎవరికైనా పెద్ద చిక్కులనే తెచ్చిపెడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూజర్లకు ఊరటనిచ్చేందుకు గూగుల్ ఓ సరికొత్త వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘సెల్ఫీ వీడియో’ సెక్యూరిటీ ఆప్షన్. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో సాధారణ సైన్-ఇన్ పద్ధతులు అందుబాటులో లేనప్పుడు లేదా పాస్వర్డ్ గుర్తులేనప్పుడు ఖాతాపై మళ్లీ యాక్సెస్ సాధించడానికి ఈ వీడియో సెల్ఫీ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని గూగుల్ తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది.
ఈ ఫీచర్ పనిచేసే విధానం కూడా చాలా సులభంగా, భద్రంగా ఉంటుంది. ముందుగా సెటప్ ప్రక్రియలో భాగంగా యూజర్లు తమ ఫోన్ సెల్ఫీ కెమెరా సాయంతో ఒక చిన్న వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో భవిష్యత్ అవసరాల కోసం గూగుల్ వద్ద ఒక రెఫరెన్స్‌గా సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ‘ఫర్గెట్ పాస్వర్డ్’ అని నొక్కినప్పుడు లేదా సాధారణ పద్ధతుల్లో సైన్-ఇన్ కానప్పుడు, గూగుల్ మిమ్మల్ని ఒక లైవ్ వీడియో తీయమని అడుగుతుంది. ముందే సేవ్ చేసిన రెఫరెన్స్ వీడియోతో ఈ లైవ్ వీడియోను సరిపోల్చి అకౌంట్‌ను ఆథెంటికేట్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే.. ముందే రికార్డ్ చేసిన వీడియోలు లేదా ఫోటోలను ఇందులో వాడటానికి కుదరదు. కేవలం అప్పటికప్పుడు లైవ్‌లో తీసే వీడియోను మాత్రమే సిస్టమ్ అంగీకరిస్తుంది. అత్యంత బహుళ మల్టిపుల్ సెక్యూరిటీ లేయర్స్ పనిచేసే ఈ టెక్నాలజీ, డీప్‌ఫేక్ వీడియోలను సైతం సులభంగా పసిగట్టి అసలైన యూజర్‌కే ఖాతా దక్కేలా పూర్తి రక్షణ కల్పిస్తుంది.
Also Read
- లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
- స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
- Samsung Galaxy A18 4G: సామ్ సంగ్ గెలాక్సీ A18 4G.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు లీక్
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!