Electric Scooter: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీ.. వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతుంది.. ఒక పక్క కార్లు, మరో పక్క బైక్‌లు స్కూటర్లు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని దేశాలకు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. విద్యుత్ శ్రేణి వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి..అదే సమయంలో వినియోగదారులు కూడా ఎక్కువగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. టాప్ బ్రాండ్లతో పాటు స్టార్టప్ లు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి..
తాజాగా మధ్యప్రదేశ్ కు సంబందించిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాంబియర్ ఎన్8ని విడుదల చేసింది. అంబియర్ ఎన్8 లోని బ్యాటరీ రెండు నుంచి నాలుగు గంటల్లోనే ఫుల్ చార్జింగ్ అవడంతో పాటు సింగిల్ చార్జ్‌పై 200 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.. ఈ స్కూటర్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
యాంబియర్ ఎన్8 1500-వాట్ మోటార్‌ను కలిగి ఉంది. ఇది గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఎనిగ్మా ప్రకారం ఈ స్కూటర్ 200 కిలోల లోడ్ కెపాసిటీని కలిగి ఉంది. అదనంగా, స్కూటర్ 26-లీటర్ బూట్ సామర్థ్యాన్ని అందిస్తుంది.. ఇది కంపెనీ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది.. ఈ ప్రత్యేక యాంబియర్ ఎన్8 ధర మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. ప్రారంభ ధర రూ. 1,05,000 నుంచి రూ. 1,10,000 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఎనిగ్మా ఆటోమొబైల్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. ఎన్8 థండర్‌స్టార్మ్ ఐదు రంగులలో లభిస్తుంది – గ్రే, వైట్, బ్లూ, మ్యాట్ బ్లాక్, సిల్వర్ కలర్లో లభిస్తున్నాయి.. ఈ స్కూటర్ సింగిల్ చార్జ్ పై 200 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని, దీంతో కొద్ది దూరాలకే చార్జింగ్ సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.. మార్కెట్ లోకి వచ్చిన వెంటనే వీటికి డిమాండ్ కూడా పెరిగింది..
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!