RTO ఆఫీసుకి వెళ్లకుండానే.. మీ DLకి కొత్త మొబైల్ నంబర్ లింక్ చేసుకోండి.! స్టెప్ బై స్టెప్ గైడ్.!
- డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ ఎందుకు అవసరం?
- పారివాహన్ వెబ్‌సైట్‌లో సులభంగా అప్‌డేట్ విధానం
- ఆఫీస్‌కు వెళ్లాల్సిన పనిలేదు - ఆన్‌లైన్‌లోనే పూర్తి
- ఓటీపీ వెరిఫికేషన్‌తో వెంటనే నంబర్ మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ (DL) కేవలం వాహనం నడపడానికే కాకుండా, ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. అయితే, లైసెన్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ లేదా సమాచారం సకాలంలో అందాలంటే, దానికి మీ ప్రస్తుత మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం చాలా అవసరం. ఒకవేళ మీరు మీ పాత ఫోన్ నంబర్‌ను మార్చుకోవాలనుకుంటే, ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఆ పని పూర్తి చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసే విధానం (స్టెప్ బై స్టెప్):
Also Read
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
- 144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
- Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
అధికారిక వెబ్‌సైట్: ముందుగా రవాణా శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్ parivahan.gov.in ని సందర్శించండి.
ఆన్‌లైన్ సర్వీసెస్: హోమ్ పేజీలో ఉన్న ‘Online Services’ విభాగంలో ‘Driving License Related Services’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
రాష్ట్ర ఎంపిక: తదుపరి పేజీలో మీ రాష్ట్రం (ఉదాహరణకు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్) పేరును ఎంచుకోండి.
మొబైల్ నంబర్ అప్‌డేట్: మెనూ బార్‌లోని ‘Others’ ట్యాబ్‌కు వెళ్లి, అందులో ఉన్న ‘Mobile Number Update’ పై క్లిక్ చేయండి.
వివరాల నమోదు: ఇప్పుడు అక్కడ అడిగిన విధంగా ‘Driving License’ ఆప్షన్‌ను ఎంచుకుని, మీ లైసెన్స్ జారీ చేసిన తేదీ (Issue Date), లైసెన్స్ నంబర్ , పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
సబ్మిట్: వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ‘Submit’ బటన్ నొక్కండి. అప్పుడు మీ ప్రస్తుత మొబైల్ నంబర్ కనిపిస్తుంది.
కొత్త నంబర్ నమోదు: ‘Proceed’ పై క్లిక్ చేసి, మీరు మార్చుకోవాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్‌ను రెండుసార్లు ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నంబర్ మార్చడానికి గల కారణాన్ని కూడా అక్కడ తెలపాల్సి ఉంటుంది.
OTP వెరిఫికేషన్: మీరు ఇచ్చిన కొత్త నంబర్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. ఆ నంబర్‌ను నమోదు చేసి ‘Verify’ పై క్లిక్ చేయండి.
పూర్తి చేయడం: చివరగా ‘Save Data’ పై క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ విజయవంతంగా అప్‌డేట్ అవుతుంది.
ముఖ్య గమనిక: ఈ ప్రక్రియ ద్వారా మీ మొబైల్ నంబర్ మారడమే కాకుండా, భవిష్యత్తులో లైసెన్స్ రెన్యూవల్ లేదా చలాన్లకు సంబంధించిన సమాచారం నేరుగా మీ ఫోన్‌కే వస్తుంది. ఇది పూర్తిగా ఉచితం , కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది.
Vaikuntha Ekadasi: వైకుంఠ ఏకాదశి వెనకున్న నమ్మకం ఇదే..

Dl
తాజావార్తలు
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
-
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?