స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. టెలికాం కంపెనీలు తక్కువు ధరలోనే డేటా అందిస్తుండడంతో ఇంటర్ నెట్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. నిద్ర లేచిన దగ్గర్నుంచి మళ్లీ పడుకునేంత వరకు ఫోన్ తోనే గడుపుతున్నారు. ఇంటర్నెట్ లేకపోతే క్షణం గడవలేని పరిస్థితి దాపరించింది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్ లోనే వెతకడం కామన్ అయిపోయింది. అయితే కొన్ని సార్లు మంచి విషయాలతో పాటు చెడు విషయాలను తెలుసుకునేందుకు కూడా గూగుల్ ను వాడుతుంటారు. గూగుల్ లో సెర్చ్ చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఏదిపడితే అది గూగుల్ లో సెర్చ్ చేస్తే చిక్కుల్లో పడడం ఖాయం అంటున్నారు నిపుణులు.
కొన్ని సార్లు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందని మొబైల్ యూజర్లకు సూచిస్తున్నారు. మరి గూగుల్ లో ఏ సమాచారాన్ని వెతకొద్దు? ఎలాంటి సైట్లను ఓపెన్ చేయొద్దు? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం? ఇప్పుడు అంతా కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు, సిరీస్ లను చూసేందుకు గూగుల్ లో వెతికే వారు ఎక్కువయ్యారు. అయితే కొత్త సినిమాలను పైరసీ చేయాలని చూసినా.. గూగుల్ లో పైరసీ మూవీస్ గురించి వెతికినా నేరం చేసినట్టే. గూగుల్ లో అశ్లీల కంటెంట్ గురించి సెర్చ్ చేస్తే నేరం కిందకు వస్తుంది. గూగుల్ లో సెర్చ్ చేయడానికి వీల్లేని వాటిలో ఆయుధాలు, బాంబులు ఎలా తయారు చేయాలి అనే విషయం ఒకటి. వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే నేరం కింద పరిగణిస్తారు.
ప్రెషర్ కుక్కర్ బాంబ్ ఎలా తయారు చేయాలి అని కూడా సెర్చ్ చేయకూడదు. నేరాలకు సంబంధించిన సమాచారం సెర్చ్ చేయకూడదు. చిన్న పిల్లల అశ్లీల వీడియోల గురించి సెర్చ్ చేయకూడదు. అబార్షన్ గురించి గూగుల్ లో సెర్చ్ చేయకూడదు. ఇవి కనుక సెర్చ్ చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి విషయాలను సెర్చ్ చేస్తే 5 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలను తెలుసుకుని దూరంగా ఉంటే ఏ ఇబ్బందులు తలెత్తవు.