Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్‌రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Watch Ultra 4 Launched: యాపిల్ తన ప్రీమియం స్మార్ట్‌వాచ్ మోడల్ Apple Watch Ultra 4ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. అమెరికాలోని యాపిల్ పార్క్ క్యాంపస్ వేదికగా నిర్వహించిన ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్లో దీన్ని విడుదల చేసింది. స్పోర్ట్స్, ఫిట్నెస్, సాహస యాత్రలు చేసే వారిని లక్ష్యంగా చేసుకుని డిజైన్ చేసిన ఈ వాచ్‌లో కొత్త హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్, శక్తివంతమైన S11 చిప్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందిస్తున్నారు. భారత్‌లో యాపిల్ వాచ్ అల్ట్రా 4 (Apple Watch Ultra 4) ప్రారంభ ధర రూ. 1,09,900గా ఉంది. ఇది నేచురల్, బ్లాక్ టైటానియం ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఈ వాచ్‌కు సంబంధించిన ప్రి-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం కాగా, సెప్టెంబర్ 18 నుంచి స్టోర్లలో అందుబాటులోకి వస్తుంది.
రక్షణ కవచం..
ఆరోగ్యం పరంగా చూస్తే ఇది ఓ రక్షణ కవచంలా పని చేస్తుందని చెప్పవచ్చు. ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇందులో కొత్త Health Sensing Systemను జోడించారు. అప్‌గ్రేడ్ చేసిన ఆప్టికల్, ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్ల ద్వారా ప్రతి 5 సెకన్లకు ఒకసారి గుండె వేగాన్ని కొలుస్తుంది. శరీరంలో ఒత్తిడి, కోలుకునే (రీకవరీ) విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ‘హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV)’ని మరింత తరచుగా రికార్డ్ చేస్తుంది. దీనిలోని Readiness అనే కొత్త ఫీచర్ ఇటీవలి శారీరక శ్రమ, నిద్ర, శరీర సంకేతాలను విశ్లేషించి 0 నుంచి 10 వరకు డైలీ స్కోర్‌ను ఇస్తుంది. ఈ స్కోర్ ఆధారంగా వినియోగదారులు విశ్రాంతి తీసుకోవాలా, సాధారణంగా ఉండాలా లేక కఠినమైన వర్కవుట్స్ చేయవచ్చా అనే సలహాలను సూచిస్తుంది.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
బిగ్ బ్యాటరీ లైఫ్..
సాధారణ వినియోగంలో ఈ వాచ్ 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అలాగే ‘లో పవర్ మోడ్’లో 84 గంటల వరకు పనిచేస్తుంది. అవుట్డోర్ వర్కవుట్స్ కోసం ఉపయోగించే ‘ఎక్స్టెండెడ్ వర్కవుట్ మోడ్’లో 25 గంటలు, ‘మాక్స్ ఎక్స్టెండెడ్ వర్కవుట్ మోడ్’లో 45 గంటల వరకు continuous GPS tracking ఇస్తుంది. కేవలం 15 నిమిషాల వైర్డ్ ఛార్జింగ్‌తో దాదాపు 18 గంటల అదనపు బ్యాటరీ లైఫ్ పొందే వీలుంది.
watchOS 27 సాఫ్ట్వేర్..
కొత్త S11 చిప్సెట్ ద్వారా ఆడియో ఇంటెలిజెన్స్ ఫీచర్లు సాధ్యమవుతాయి. సంభాషణల్లోని చివరి 15 సెకన్లను మళ్లీ తెలుసుకునే ‘లైవ్ రీవైండ్ (Live Rewind)’, ముఖ్యమైన విషయాలను సంక్షిప్తంగా చెప్పే ‘సిరి రీక్యాప్ (Siri Recap)’ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. watchOS 27 సాఫ్ట్‌వేర్‌పై పనిచేసే ఈ వాచ్‌లో సిరి ఏఐ మరింత వ్యక్తిగత సందర్భాన్ని అర్థం చేసుకుని స్పందిస్తుంది. టైటానియం బాడీ, ఖచ్చితమైన జిపిఎస్ (GPS), మెరుగైన స్టెప్స్/డిస్టెన్స్ ట్రాకింగ్‌తో ఈ Apple Watch Ultra 4 అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఉపయోగపడేలా రూపొందించారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!