Apple Watch Series 11: ఆపిల్ వాచ్ ఎంతో మంది డ్రీమ్ వాచ్. తాజాగా ఆపిల్ వాచ్ సిరీస్ 11 పై కంపెనీ భారీ డిస్కౌంట్ ఇచ్చింది. ఈ ఏడాదిలో ఫస్ట్ టైం ఆపిల్ వాచ్ సిరీస్ 11పై ధరను తగ్గించింది. రిపబ్లిక్ డే సేల్‌కు ముందే ఈ డీల్స్‌ను ప్రకటించినట్లు కంపెనీ పేర్కొంది. ఇంతకీ ఈ స్టోరీలో ఆపిల్ వాచ్ 11 ధర ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
READ ALSO: India-China: “షక్స్‌గామ్ వ్యాలీ మాదే, భారత్‌ది కాదు”.. చైనా ప్రకటన..
ఆపిల్ వాచ్ సిరీస్ 11 కొత్త ధర ..
ఆపిల్ వాచ్ సిరీస్ 11 ధర రూ.39,999 కు తగ్గించినట్లు కంపెనీ తాజాగా తెలిపింది. గత ఏడాది ఈ వాచ్ స్టార్టింగ్ ధర రూ.46,999 కు ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది ఆపిల్ వాచ్ సిరీస్ 11 పై కంపెనీ ఇప్పటికే తగ్గించిన ధరతో పాటు బ్యాంక్ ఆఫర్లతో, ధరను మరింత తగ్గించు కోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ వాచ్ సిరీస్ 11 గత సంవత్సరం భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్లలో ఒకేసారి అందుబాటులోకి వచ్చింది. ఆ టైంలో దీని ప్రారంభ ధర రూ.46,999. ఈ వాచ్‌కు కంపెనీ అనేక కొత్త ఫీచర్లు, మెరుగైన సెన్సార్లను కూడా జోడించింది. ఈ వాచ్ మెరుగైన ఆరోగ్య ట్రాకింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇది రక్తపోటు, దీర్ఘకాలిక అధిక రక్తపోటును పర్యవేక్షించగలదు. అలాగే ఇందులో ట్రాన్స్‌లేషన్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంటుంది.
తాజా ఆపిల్ వాచ్ సిరీస్ 11 గతంలో వచ్చిన దానికంటే ఇప్పుడు బలమైన IonX గాజును ఉపయోగిస్తుంది. ఇది రెండు రెట్లు బలంగా, గీతలు కూడా పడకుండా ఉంటుంది. ఈ ఆపిల్ వాచ్ సిరీస్ 11 అధిక రక్తపోటు నోటిఫికేషన్లు, ECG యాప్, అధిక, తక్కువ హృదయ స్పందన రేటుకు నోటిఫికేషన్లను ఇస్తుంది. ఇది నిద్రను కూడా ట్రాకింగ్ చేసి, నిద్ర స్కోర్‌ను కూడా అందిస్తుంది. దీనికి ఉష్ణోగ్రత సెన్సార్ కూడా ఉంది. దీని బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. ఆపిల్ వాచ్ సిరీస్ 11 మెరుగైన బ్యాటరీని అందిస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 24 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 18 గంటల సాధారణ ట్రాకింగ్, 6 గంటల స్లీప్ ట్రాకింగ్ ఉంటాయని పేర్కొంది. ఆపిల్ వాచ్ సిరీస్ 11 కోసం watchOS 26 తీసుకొచ్చింది. ఈ కొత్త వాచ్ యూజర్స్ కోసం అనేక కొత్త ఫీచర్లను కూడా అందిస్తోంది.
READ ALSO: Allu Aravind: చిరుపై మెగా ప్రశంసలు కురిపించిన అల్లు అరవింద్..