Site icon NTV Telugu

Apple Warns: ఐఫోన్ యూజర్స్కి అలర్ట్.. గూగుల్- క్రోమ్లని ఉపయోగించొద్దని ఆపిల్ హెచ్చరిక

Iphone

Iphone

Apple Warns: ఐఫోన్‌ వినియోగదారులకు ఆపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్‌- క్రోమ్‌ బ్రౌజర్‌ను వాడటం మానేయాలని సూచించింది. క్రోమ్‌తో పోలిస్తే సఫారి మీ గోప్యతను నిజంగా కాపాడుతుందని తెలియజేసింది. ప్రకటనలు, వెబ్‌సైట్లు డిజిటల్‌ ఫింగర్‌ప్రింట్‌ సృష్టించి వినియోగదారులను ట్రాక్‌ చేయకుండా ఉండేందుకు సఫారీ ఉపయోగపడుతుంది. అలాగే, మీ డివైస్‌కు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను కలిపి ఒక డిజిటల్ ఫింగర్‌ప్రింట్‌ సృష్టించి, మీ ఆన్‌లైన్‌ కదలికలను ట్రాక్‌ చేయకుండా ఉండేందుకు సఫారి రక్షణగా నిలుస్తుందని ఆపిల్ సూచించింది.

Read Also: Supreme Court: ‘ఇండిగో సంక్షోభం’ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఝలక్

డిజిటల్ ఫింగర్‌ప్రింటింగ్ అంటే ఏమిటి?
మీరు ఇంటర్నెట్‌లో బ్రౌజ్‌ చేస్తుంటే, మీ మొబైల్‌/ కంప్యూటర్‌ గురించి చిన్న చిన్న సమాచారాలు మీకు తెలియకుండా లీక్‌ అవుతాయి. బ్రౌజర్‌ టైప్, ఇన్‌స్టాల్ చేసిన ఫాంట్లు, ఆపరేటింగ్ సిస్టమ్‌, హార్డ్‌వేర్‌ వివరాలు అన్నీ కలిపి ఒక ప్రత్యేక డిజిటల్ ఫింగర్‌ప్రింట్‌ రూపొందిస్తాయి.

Read Also: December Clash : కన్నడ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి

సఫారీలో ఉండే రక్షణలు:
ఈ డిజిటల్ ఫింగర్ ప్రింటింగ్ ను ఆపేందుకు కుకీలను బ్లాక్‌ చేసినా లేదా ఇన్‌కాగ్నిటోలో బ్రౌజ్‌ చేసినా కూడా ఆపలేరు.. ఇలాంటి ట్రాకింగ్‌ నుంచి రక్షించేందుకు సఫారి సిస్టమ్‌ సెట్టింగులను సింప్లిఫై చేసి, పెద్ద సంఖ్యలో డివైస్‌ ట్రాకర్లకు ఒకేలా కనిపించేలా చేస్తుందని ఆపిల్‌ సంస్థ ప్రకటించింది. AI ఆధారిత ట్రాకింగ్‌ నిరోధకతను అందిస్తుంది. లోకేషన్‌ని ట్రాక్‌ చేయడం నుంచి కాపాడుతుంది.. ప్రైవేట్ బ్రౌజింగ్‌ మోడ్ను మరింత సురక్షితం చేస్తుంది. సఫారి, గూగుల్‌ షీట్స్‌, స్లైడ్స్‌, డాక్స్‌ లాంటి గూగుల్‌ సేవలతో బాగా ప నిచేస్తుందని చెప్పింది. ఈ హెచ్చరిక క్రోమ్‌ మాత్రమే కాదు, ఇతర గూగుల్‌ ఆప్స్‌ కూడా చేర్చబడినట్లే ఆపిల్‌ స్పష్టం చేసింది.

Read Also: Girls Develop Facial Hair: అమ్మాయిలకు గడ్డాలు, మీసాలు..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?

గూగుల్‌, ఫింగర్‌ప్రింటింగ్‌పై ఆపిల్‌ ఆందోళన..
గూగుల్‌ ఇటీవల డిజిటల్‌ ఫింగర్‌ప్రింటింగ్‌ పై ఉన్న నిషేధాన్ని తొలగించడంతో, ఈ టెక్నాలజీ మళ్లీ పెద్ద సమస్యగా మారుతోందని ఆపిల్‌ పేర్కొంది. ఈ టెక్నాలజీని వినియోగదారులు డిసేబుల్ చేయకపోవడమే అతి పెద్ద ప్రమాదం. మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ కూడా ఇలాంటి రక్షణలను అందిస్తున్నప్పటికీ, క్రోమ్‌ మాత్రం ఈ అంశాల్లో వెనుకబడిందని ఆపిల్‌ ఆరోపిస్తోంది.

Exit mobile version