Site icon NTV Telugu

రిసైకిల్ మెటీరియల్ + కలర్ ఫుల్ ప్రీమియం డిజైన్ తో Apple Unity Connection బ్యాండ్ లాంచ్.!

Apple Unity Connection Band

Apple Unity Connection Band

Apple Unity Connection Band: ఆపిల్ (Apple) కొత్తగా ఓ లిమిటెడ్ ఎడిషన్ ‘యూనిటీ కనెక్షన్ బ్రైడెడ్ సోలో లూప్’ (Unity Connection Braided Solo Loop) ఆపిల్ వాచ్ బ్యాండ్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌కు అందుబాటులో ఉంది ఈ బ్యాండ్. కొత్తదనం, సృజనాత్మకత, కమ్యూనిటీ ఐక్యతను ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది.

IP68+IP69 రేటింగ్స్, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో పాటు భారీ డిస్కౌంట్తో భారత్‌లో vivo X200T లాంచ్..!

డిజైన్ & ప్రత్యేకత:
ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ‘యూనిటీ కనెక్షన్ బ్రైడెడ్ సోలో లూప్’ బ్యాండ్‌ను బ్లాక్ కమ్యూనిటీలకు చెందిన ఆపిల్ డిజైనర్లతో రూపొందించారు. ఇది పాన్-ఆఫ్రికన్ జెండా రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నలుపు షేడ్స్‌తో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. దీని కోసం రిసైకిల్ చేసిన పాలిస్టర్ యార్న్‌ను పలుచని సిలికాన్ థ్రెడ్‌ల చుట్టూ యంత్రాల సహాయంతో అత్యంత ఖచ్చితమైన బ్రెయిడ్ తో ఈ బ్యాండ్ తయారు చేయబడింది. దీనితో ఇది సాఫ్ట్ టెక్స్చర్‌తో పాటు చెమట, నీటిని తట్టుకునే లక్షణం కలిగి ఉంది. రంగుల మిశ్రమం వల్ల బ్యాండ్‌కు లేయర్డ్, వైబ్రెంట్ లుక్ అదిరిపోయింది.

స్పెసిఫికేషన్స్:
కేస్ సైజ్: 42mm, 46mm
బ్యాండ్ సైజ్: 0 నుంచి 12 వరకు
మెటీరియల్: 100% పోస్ట్-కన్స్యూమర్ రిసైకిల్ పాలిస్టర్, 80% రిసైకిల్ స్టెయిన్‌లెస్ స్టీల్
కంపాటిబిలిటీ: ఆపిల్ వాచ్ 44mm, 45mm, 46mm, 49mm మోడల్స్

మరింత రేంజ్, గట్టిగా వినిపించే సౌండ్‌తో కొత్త Apple AirTag లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

ధర:
ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్యాండ్ ధర రూ. 9,500గా నిర్ణయించారు. ఇది 42mm, 46mm సైజ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 4 లేదా అంతకంటే కొత్త మోడల్స్, ఆపిల్ వాచ్ SE, అలాగే ఆపిల్ వాచ్ అల్ట్రా (46mm మాత్రమే)కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాండ్‌ను ప్రస్తుతం ఆపిల్ స్టోర్ వెబ్‌సైట్, ఆపిల్ స్టోర్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఆపిల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రానుంది.

Exit mobile version