iPhone Air 2: టెక్ దిగ్గజం యాపిల్ (Apple) iPhone Air సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొత్త రీడిజైన్‌పై పనిచేస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం యాపిల్ సంస్థ iPhone Air 2లో రెండవ రియర్ కెమెరా లెన్స్‌ను జోడించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇది వినియోగదారులను మరింత ఆకర్షించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. యాపిల్ ఇంజనీర్లు ప్రస్తుతం డ్యూయల్ కెమెరా సెటప్ ను పరీక్షిస్తున్నారు. మొదటి తరం iPhone Airలో ఒక్క కెమెరా మాత్రమే ఉండటంతో అది విమర్శలలో ఒకటిగా మారింది. ఈ లోటును పూడ్చడమే కాకుండా.. ఫోటోగ్రఫీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా iPhone Airను యాపిల్ యొక్క ఇతర మోడళ్లతో సరిపోల్చాలనే ఉద్దేశం ఉంది.
Rashid Khan: ‘మిస్టరీ గర్ల్’తో రషీద్ ఖాన్.. అసలు విషయం ఏంటంటే?
మొదటి తరం iPhone Air తన సూపర్ సన్నని డిజైన్, తేలికైన నిర్మాణం వల్ల ప్రశంసలు పొందినా.. ఫీచర్ల పరంగా, ముఖ్యంగా కెమెరా పనితీరులో కొంత రాజీ పడిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక రెండో లెన్స్‌ను జోడించడం ద్వారా ఫోటో వెర్సటిలిటీ మెరుగుపడటంతో పాటు, ప్రొఫెషనల్ స్థాయి ఇమేజింగ్ అనుభవాన్ని అందించగలదని అంచనా. ప్రస్తుతం యాపిల్ మొదటి తరం iPhone ఎయిర్ ఉత్పత్తిని తగ్గించింది. ప్రణాళిక ప్రకారం iPhone Air 2 ను 2026 చివరి త్రైమార్షికం లేద 2027 మొదటి త్రైమార్షికంలో లాంచ్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సరైన తేదీని మాత్రం ఖరారు కాలేదు. ప్రస్తుతం iPhone Air సిరీస్‌ను యాపిల్ నిలిపివేయలేదు. సంస్థ ఇంకా సరఫరాదారులతో కలిసి ప్రోటోటైప్ రివిజన్లపై పనిచేస్తోంది. ఈ రీడిజైన్ యాపిల్ పెద్ద వ్యూహంలో తక్కువ మందంతో ఎక్కువ ఫంక్షనాలిటీ సాధించాలనే ప్రయత్నం.
Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి, వెల్లుల్లిని నిషేదించిన ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా..