Site icon NTV Telugu

iPhone 12 Price Drop: అకస్మాత్తుగా తగ్గిన ఐఫోన్ 12 ధర.. 17 వేలకే ఇంటికితీసుకెళిపోవచ్చు!

Iphone 12

Iphone 12

Purchase Apple iPhone 12 Only Rs 16999 in Flipkart: ‘యాపిల్’ కంపెనీ తన ఐఫోన్ 15 సిరీస్‌ను ఈ సంవత్సరం విడుదల చేయబోతోంది. కొత్త ఫోన్ లాంచ్ అయిన వెంటనే పాత మోడల్స్ ధరలను కంపెనీ తగ్గిస్తోంది. ఈ క్రమంలోనే ఐఫోన్ 12 (iPhone 12) ధరను భారీగా తగ్గించేసింది. మీ వద్ద బడ్జెట్ తక్కువగా ఉండి.. కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఐఫోన్ 12ను ఈరోజు అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ. 17 వేలకే ఇంటికితీసుకెళిపోవచ్చు. మీరు ఈ ధరను అస్సలు నమ్మడం లేదు కదా!. ఆ వివరాలు ఓసారి చూద్దాం.

iPhone 12 Price:
ఐఫోన్ 12 (64GB)ని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 ధర రూ. 59,900 అయినప్పటికీ.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 53,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై 9% తగ్గింపు ఇవ్వబడుతోంది. తగ్గింపు ఆఫర్ కాకుండా.. బ్యాంక్ మరియు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉన్నాయి. దాంతో ఐఫోన్ 12 ధర మరింత తగ్గుతుంది.

Also Read: Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్‌ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

iPhone 12 Bank Offers:
ఐఫోన్ 12ని కొనుగోలు చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు 2 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ ధర రూ. 51,999గా అవుతుంది. ఇది మీకు భారంగా ఉంటే.. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది.

iPhone 12 Exchange Offer:
ఐఫోన్ 12పై 35 వేల రూపాయల ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుంటే.. ఈ మొత్తం లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగుండి, లేటెస్ట్‌ మోడల్ అయుండాలి. అంతేకాదు ఎలాంటి డామేజ్ కూడా ఉండకూడదు. పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ వర్తిస్తే.. ఐఫోన్ 12ను రూ. 16,999కే మీ సొంతం అవుతుంది.

Also Read: Airtel New Plan 2023: ఎయిర్‌టెల్ నుంచి చౌకైన ప్లాన్ వచ్చేసింది.. 35 రోజుల పాటు అపరిమిత కాలింగ్, డేటా!

Exit mobile version