WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WWDC 2026: ఆపిల్ నిర్వహించిన WWDC 2026 ఈవెంట్లో నేరుగా ప్రకటించకపోయినా, సంస్థ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా భావిస్తున్న ‘iPhone Ultra’కు సంబంధించిన కొన్ని సంకేతాలు టెక్ వర్గాల కంట పడ్డాయి. 2026 సెప్టెంబర్‌లో ఐఫోన్18 ప్రో సిరీస్‌తో పాటు.. “ఐఫోన్ అల్ట్రా” కూడా విడుదలయ్యే అవకాశముందని గత కొంతకాలంగా వరాతలు వినిపిస్తున్నాయి.
WWDC ముగిసిన వెంటనే విడుదలైన iOS 27 డెవలపర్ బీటాలో కొన్ని ఆసక్తికరమైన కోడ్ రిఫరెన్సులు కనిపించాయి. టెక్ విశ్లేషకుల ప్రకారం.. కోడ్‌లో “foldState”, “angleDegrees” వంటి పదాలతో పాటు ఒక డివైస్‌లో ఎన్ని డిస్ప్లేలు ఉన్నాయో గుర్తించే కొత్త MobileGestalt కీ కనిపించింది. ఇప్పటివరకు అన్ని ఐఫోన్లలో ఒకే డిస్ప్లే ఉండటంతో ఇలాంటి ఫీచర్ అవసరం లేదు. అయితే ఫోల్డబుల్ ఫోన్లో రెండు డిస్ప్లేలు లేదా విస్తరించే స్క్రీన్ ఉండే అవకాశం ఉండటంతో ఈ కోడ్‌పై ఆసక్తి నెలకొంది.
Also Read
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
ఇక macOSలోని iPhone Mirroring ఫీచర్‌ను ఐప్యాడ్ తరహాలో పెద్ద స్క్రీన్ సైజ్‌కు రీసైజ్ చేయగలగడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫోల్డ్ చేసిన స్థితి నుంచి విప్పినప్పుడు యాప్‌లు ఎలా మారతాయో, పెద్ద డిస్ప్లేపై ఎలా పనిచేస్తాయో పరీక్షించేందుకు ఆపిల్ ముందుగానే ఏర్పాట్లు చేస్తోందని కొందరు టెక్ నిపుణులు భావిస్తున్నారు. అదేవిధంగా WWDC 2026లో పరిచయం చేసిన Xcode Device Hub ద్వారా యాప్‌లను వివిధ స్క్రీన్ పరిమాణాలకు సులభంగా అనుకూలీకరించగల సామర్థ్యం కూడా ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంకేతంగా కొందరు పేర్కొంటున్నారు. అయితే ఇది కేవలం ఐఫోన్, ఐప్యాడ్ల మధ్య యాప్ అనుకూలతను మెరుగుపరచడానికే కావచ్చని మరో వాదన కూడా ఉంది.
ఇదిలా ఉండగా.. WWDC ప్రెజెంటేషన్‌లోని ఒక వీడియోలో కనిపించిన కొన్ని మందపాటి పరికరాల ట్రే కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆ ట్రేలో కనిపించిన పరికరాలు ఫోల్డబుల్ ఐఫోన్ ప్రోటోటైప్స్ కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. మొత్తానికి WWDC 2026లో కనిపించిన ఈ సంకేతాలు నిజంగా ఐఫోన్ అల్ట్రా గురించినవేనా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌పై ఆసక్తి మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే పరిగణించాలి.
Apple accidentally leaks its foldable iPhone
macOS 27 beta reportedly lets users stretch an iPhone screen-mirroring window until the interface looks like an iPad
‘Lol, could this be any more obvious?’ — Bloomberg’s Mark Gurman reacted pic.twitter.com/j8C0PabXoU
— RT (@RT_com) June 9, 2026
iOS 27 framework references “foldState” and “angleDegrees” but I’m sure that’s nothing pic.twitter.com/PcYNVvymms
— sam henri gold (@samhenrigold) June 8, 2026
తాజావార్తలు
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
-
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!