Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు
- అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026
- జూలై 4 అర్ధరాత్రి 12:00 గంటలకు ప్రారంభమై, జూలై 6 రాత్రి 11:59 గంటల వరకు
- స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్ షాపింగ్ కోసం ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. జూలై 4 నుంచి ప్రారంభమయ్యే Amazon Prime Day Sale 2026 కోసం కంపెనీ ఇప్పటికే పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో సామ్ సంగ్, వన్‌ప్లస్, iQOO, రెడ్మీ, రియల్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు అందించనుంది. అంతేకాకుండా టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.
స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు
ఈసారి ప్రైమ్ డే సేల్‌లో పలు ప్రీమియం, మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్లు భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
OnePlus 15R ప్రారంభ ధర రూ.68,999 నుంచి రూ.55,999కు లభించనుంది. అంటే సుమారు రూ.13,000 తగ్గింపు.
Samsung Galaxy S25 Ultra తొలిసారిగా రూ.84,999 ప్రారంభ ధరకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ అసలు ప్రారంభ ధర రూ.1,29,999.
OnePlus 13 ధర రూ.72,999 నుంచి రూ.49,999కు తగ్గనుంది.
iQOO Z11x 5Gపై సుమారు రూ.9,000 తగ్గింపు లభించగా, ఇది రూ.19,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది.
Redmi A7 Pro 5G ధర రూ.15,999 నుంచి రూ.12,999కు తగ్గింది.
Realme Narzo 100 Lite 5Gను రూ.14,249 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు.
iQOO 15R కూడా రూ.53,999 నుంచి రూ.45,999కు తగ్గింపుతో లభిస్తుంది.
ఐఫోన్, కొత్త మోడళ్లపై కూడా డీల్స్
అమెజాన్ ఈ సేల్‌లో iPhone 17 Proపై కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.1,34,900 కాగా, సేల్ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల విడుదలైన Redmi Turbo 5పై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి. మరోవైపు Samsung Galaxy M47, OnePlus N6 వంటి కొత్త స్మార్ట్ఫోన్లు కూడా జూలై 4 నుంచి తొలిసారిగా అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి.
టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లపై కూడా ఆఫర్లు
స్మార్ట్ఫోన్లతో పాటు టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. వివిధ బ్రాండ్లపై ప్రత్యేక ధరలు, బ్యాంక్ ఆఫర్లు, EMI సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఎప్పుడు ప్రారంభం?
Amazon Prime Day Sale జూలై 4 అర్ధరాత్రి 12:00 గంటలకు ప్రారంభమై, జూలై 6 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. ప్రైమ్ సభ్యులకు ప్రతి కొనుగోలుపై 10 శాతం తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, No Cost EMI ఆప్షన్లు, అలాగే పాత స్మార్ట్ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. పండుగల సీజన్‌కు ముందే స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ లేదా ఇతర గ్యాడ్జెట్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్రైమ్ డే సేల్ మంచి అవకాశంగా నిలవనుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!