NTV Telugu Site icon

ISRO Chairman Somnath: ఏలియన్స్ భూమిపైకి వచ్చారు.. ఇస్రో ఛైర్మన్ సంచలన ప్రకటన

Isro Chairman

Isro Chairman

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల పాడ్‌కాస్ట్‌లో పెద్ద ప్రకటన చేశారు. ఈ పోడ్‌కాస్ట్‌లో గ్రహాంతర నాగరికతల ఉనికి గురించి చర్చించారు. విశ్వంలో గ్రహాంతర వాసులు ఖచ్చితంగా ఉన్నారని.. వారి నాగరికతలు వివిధ రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సోమనాథ్ చెప్పారు. ఏలియన్స్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

READ MORE: Triglycerides: గుండెకు ముప్పు కలిగించే ట్రై గ్లిజరైడ్ అంటే ఏమిటి..?

గ్రహాంతరవాసులు మన గ్రహంపైకి వచ్చారా? అని పోడ్‌క్యాస్టర్ రణవీర్ అల్లాబాడియా సోమనాథ్‌ను అడగ్గా.. “అవును. ఇది వచ్చారని ఆయన అంగీకరించారు. గ్రహాంతరవాసులు మన భూమిని సందర్శించారనడంలో తనకు ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కానీ తన దగ్గర దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారని.. వారు సాంకేతికతలో మావులకంటే ముందు ఉన్నారు.

READ MORE: Diwali 2024: దీపావళి రోజు ఈ సమస్యల వల్ల కళ్ళకు ప్రమాదం.. జాగ్రత్తగా లేకపోతే..?

మానవాళి సాంకేతిక అభివృద్ధిపై దృష్టిని ఆకర్షించిన సోమనాథ్, వంద సంవత్సరాల క్రితం మన సాంకేతిక సామర్థ్యాలు చాలా పరిమితంగా ఉన్నాయని అన్నారు. మన నాగరికత సంవత్సరాలుగా సాంకేతికంగా అభివృద్ధి చెందినట్లే, విశ్వంలోని ఇతర నాగరికతలు కూడా వివిధ దశలలో ఉండవచ్చని వివరించడానికి ఆయన ఉదాహరణలు ఇచ్చారు. గ్రహాంతర నాగరికతలు, అభివృద్ధి, పురోగతి యొక్క వివిధ స్థాయిలలో ఉండవచ్చు.. విశ్వంలో వారి స్వంత దశలలో ఉనికిలో ఉండవచ్చని వారు నమ్ముతారన్నారు. అయితే.. ఇస్రో చీఫ్ ఏలియన్స్ ఉనికి గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా గ్రహాంతరవాసులు భూమిని సందర్శించారని చెప్పారు.

READ MORE: Shruti Haasan: ఏఐ టెక్నాలజీతో మెరిసిపోతున్న శ్రుతి హాసన్