AI Education: ఏఐ పిల్లల మెదడుకే ముప్పు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI students education: కాలం మారింది. ఇప్పుడు గణితం లేదా సైన్స్‌లోని ప్రశ్నలను ఛేదించడానికి గంటల తరబడి ఆలోచించాల్సిన అవసరం లేదు. చరిత్రను బట్టిపట్టాల్సిన పని లేదు. హోంవర్క్ గురించి తల్లిదండ్రులతో పిల్లల వాదనలు లేవు. ఇది ఏఐ యుగం. విదేశీ భాషా పాఠాన్ని అర్థం చేసుకోవడంలో అయినా, ఏ సమాచారాన్ని నేర్చుకోవడంలో అయినా పిల్లలకు చాలా ఈజీ. ఎందుకంటే పిల్లల చేతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే అతిపెద్ద ఆయుధం ఉంది. కానీ.. ఏఐపై అనేక అనుమానాలూ ఉన్నాయి. ఈ ఆయుధం విద్యార్థుల సహజ మేధస్సుకు ముప్పు కలిగిస్తుందా లేదా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవలి సేకరించిన ప్రపంచ డేటా, నిపుణుల అభిప్రాయాలు ఓ కొత్త చర్చను రేకెత్తించాయి. ఈ అంశంపై పూర్తి వివరాలను తెలుసుకుందాం..
READ MORE: Shocking: 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్..
Also Read
- ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
- Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
- Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
గ్యాలప్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. దాదాపు 57% మంది విద్యార్థులు ప్రతి వారం ఏఐ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వంటి విదేశీ విద్యా సంస్థలు రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ వంటి పనుల కోసం దీనిని విజయవంతంగా వాడుతున్నాయి. కానీ, ఈ సౌలభ్యం వెనుక ఉన్న ప్రమాదాలను నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏఐ వాడకం వల్ల ముఖ్యంగా విమర్శనాత్మక ఆలోచనా శక్తి (Critical Thinking) క్షీణించి పోతుందట. విద్యార్థులు తమ హోంవర్క్ లేదా వ్యాసాల కోసం ఏఐ మీద ఆధారపడటం వల్ల, సొంతంగా ఆలోచించే, విశ్లేషించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారట. దీనిని నిపుణులు ‘కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్’ అని పిలుస్తున్నారు. అంతేకాదు.. ఏఐ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని సైతం ఎంతో నమ్మకంగా చెబుతుంది. విద్యార్థులు దానిని గుడ్డిగా నమ్మడం వల్ల తప్పుడు జ్ఞానాన్ని పొందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏఐ సహాయంతో డిగ్రీలు సాధించినా, రేపు పని ప్రదేశంలో (Workplace) సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ తరం విద్యార్థులు విఫలమయ్యే అవకాశం ఉందట.
మరోవైపు.. కొందరు నిపుణులు మాత్రం ఏఐని సమర్థిస్తున్నారు. ఏఐని సరిగ్గా ఉపయోగిస్తే విద్యార్థులు మరింత తెలివిగా మారుతారని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రపంచంలోని అపారమైన జ్ఞానాన్ని ఏఐ ద్వారా విద్యార్థులు పొందగలుగుతున్నారట. ఇది వారిలో అన్వేషణా తత్వాన్ని పెంచుతుందే తప్ప, వారిని సోమరిపోతులుగా మార్చదని వీరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు వాదనలు పరిశీలించి మనం ఓ మనం నిర్ణయానికి రావాలి. ఏఐ అనేది ఒక ‘అసిస్టెంట్’ (సహాయకుడి)లా మాత్రమే ఉండాలి తప్ప, ‘మెదడు’కు ప్రత్యామ్నాయం కాకూడదు. విద్యా సంస్థలు ఏఐ వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. సాంకేతికతను వాడుకుంటూనే, మానవ మేధస్సును పదును పెట్టుకున్నప్పుడే ఈ తరం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగలదు.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!