సాంకేతికతతో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలు సైతం ఉన్నాయన్నది నిజం. ప్రస్తుతం ఏఐ చాలా ఉపయోగకరమని అందరూ భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఏఐ కారణంగా బాలుడు ఆత్మహత్య చేసుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. అందరినీ షాకింగ్ కి గురి చేసిన ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వైరల్ అవుతోంది. ఇది చదివిన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Damodara Rajanarsimha: ప్రజలకు వైద్యం, విద్య, సంక్షేమం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం..
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సెవెల్ సెట్జర్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని పాత్ర ఆధారంగా సెవెల్ డేనెరిస్ అనే చాట్‌బాట్‌తో మాట్లాడేవాడు. ఆ చాట్‌బాట్ పాత్ర సెవెల్‌తో ప్రేమలో ఉన్నట్లు పేర్కొంది. ఇద్దరి మధ్య శృంగార సంభాషణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటే సెవెల్ ఫోన్‌ను లాక్కున్నారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. సెవెల్ ఏప్రిల్ 2023లో క్యారెక్టర్.ఏఐ (Character.AI)ని ఉపయోగించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. బాస్కెట్‌బాల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఒంటరిగా ఫోన్ గడపడం ప్రారంభించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఫోన్‌ని లాక్కున్నారు. డేనెరిస్‌కి సందేశం పంపారు. దీంతో కొద్దిసేపటి తర్వాత సవతి తండ్రి పిస్టల్‌తో సెవెల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెవెల్ ఆత్మహత్యపై క్యారెక్టర్.ఏఐ (Character.AI) తన బాధను వ్యక్తం చేసింది. ఘటన తర్వాత కంపెనీ భద్రతా చర్యలను అమలు చేస్తూ.. మైనర్ వినియోగదారుల కోసం సున్నితమైన కంటెంట్‌ను తీసివేస్తానని వాగ్దానం చేసింది.
READ MORE:Baby Boy Sale: రూ.లక్ష కోసం కన్నబిడ్డను అమ్మేసిన తల్లి
ఈ ఘటనపై సెవెల్ సెట్జర్ తల్లి.. మేగాన్ గార్సియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ కంపెనీ క్యారెక్టర్. ఏఐ(Character.AI) పై దావా వేసింది. తన 14 ఏళ్ల కొడుకు కంపెనీ చాట్‌బాట్ సర్వీస్‌కు బానిస అయ్యాడని గార్సియా పేర్కొంది. ఈ పాత్ర ఏఐ ఒక మానవరూప, అత్యంత శృంగారభరితమైన, భయానక వాస్తవ అనుభవాన్ని అందించిందని తల్లి పేర్కొంది. ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని ఫెడరల్ కోర్టులో కేసు విచారణ జరిగింది.