రాష్ట్రఅవతరణ దినోత్సవం రోజున వైఎస్సార్ అవార్డుల కార్యక్రమాన్ని జరపడాన్ని ట్విట్టర్ వేదికగా మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఏ సంబంధం లేని మీ తండ్రి వైఎస్సార్ గారి పేరుపెట్టి ఈ రోజు పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం తప్పని ఇది సరికాదని, మహానీయుడు పొట్టిశ్రీరాములును అవమానించడమేనన్నారు. పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పాణతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అమరజీవికి ఓ దండ వేసి చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు. మన రాష్ట్ర…