చిన్నారి చైత్రకు ప్రభుత్వం, పోలీసులు చెయ్యలేని న్యాయం దేవుడు చేశాడని వైఎస్ఆర్.టి.పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశాడు. కనీసం 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమేనని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ షర్మిళ మాట్లాడుతూ.. ‘మేము దీక్ష చేసిన తరువాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు 200 మంది పోలీసులు మాపై దాడిచేశారు.…